Monday, August 3, 2026
31.5 C
Hyderabad

విలీనమా? విమోచనమా? విద్రోహమా?|EDITORIAL

చెరిపేస్తే చెరిగిపోనిది, మసకేస్తే మాసిపోనిది చరిత్ర. దాన్ని ఎవరూ చెరిపేయలేరు. మసిపూసి మారేడుకాయ చేసినా, కాలం పేజీలోంచి తీసేయలేరు. ఎవరి మనోభావాలను కించపరుస్తుందనో, దెబ్బ తీస్తుందనో, మరెవరి స్వప్రయోజనాలు, ఓట్ల బ్యాంకు కోసమో తాత్కాలికంగా వక్రీకరింప చూసినా, అది నిక్కచ్చిగా నిలబడి, కచ్చితంగా నిలదీసి, నిగ్గదీస్తుంది. నాడు నిజాం నుంచి విముక్తి కోసం ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. ఆత్మ బలిదానాలు చేశారు. దీన్ని తెలంగాణ విమోచనోద్యమంగానే పిలుస్తారు. దీన్నే ఒకరు విలీన దినంగా, మరొకరు జాతీయ సమైక్య దినోత్సవంగా, ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నారు. అంతా కలిసి ఓ చారిత్రాత్మక సత్యానికి విద్రోహం చేస్తున్నారు.
స్వాతంత్రానంతరం దేశంలోని 540కి పైగా సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనమైనప్పటికీ, హైదరాబాద్ స్టేట్, కశ్మీర్, జునాగఢ్ లు నిరాకరించాయి. దీంతో, జనరల్ చౌదరి నేతృత్వంలోని భారత బలగాలు ‘ఆపరేషన్ పోలో’ను 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించాయి. భారత్ సైన్యం హైదరాబాద్ కు 115 కిలోమీటర్ల దూరంలోని జహీరాబాద్ కు చేరుకోవడంతో, ఇక తప్పని పరిస్థితిలో నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న, నిజాం తన రేడియో కేంద్రానికి వెళ్లి భారత యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ ను విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. సెప్టెంబర్ 18న, అధికారికంగా విలీన ప్రక్రియ పూర్తైంది.
విమోచన దినోత్సవం జరపడం అంటే ఆనాటి దాష్టీకాలను ఎండగట్టడం, త్యాగాలను సర్మించుకోవడం మాత్రమే. నాటి అరాచాకాలను గుర్తు చేసుకుంటూ, ఆనాటి ఘటనల్లో మరణించిన ప్రజలకు నివాళి అర్పించడం. ప్రపంచ చరిత్రలో పోరాటాలన్నీ నిరంకుశత్వం మీద జరిగినవే. వాటిని స్వాతంత్య్ర దినాలుగానే జరుపుకుంటున్నారు. తెలంగాణ విముక్తం కూడా ఒక స్వాతంత్య్ర దినోత్సవమే.
తెలంగాణలో రజాకార్లు చేసిన ఘాతుకాలు రక్తచరిత్రకు తార్కాణాలు. నిజాంకాలంలో భూస్వామ్యం పడగలెత్తి, గ్రామాలను దోపిడీ చేసి పీడిస్తున్నందున ప్రజలు తిరగబడ్డారు. పోరాడారు. భూములు ఆక్రమించుకుని పంచుకున్నారు, మరోవైపు నిజాంను కీలుబొమ్మ చేసుకున్న రజాకార్లు కమ్యూనిస్టులపై, కొన్ని చోట్ల కాంగ్రెస్‌ వారిపై, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఉంటే అక్కడ దౌర్జన్యాలు చేశారు. భూస్వాముల గడీల్లో ఆశ్రయం పొందుతూ వారి తరఫున దాడులు చేశారు. పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. పరకాలలో నరమేథం మరో జలియన్ బాగ్ లాగా సాగింది. బైరాన్‌పల్లిలో ఆడవాళ్లను నగ్నంగా బతుకమ్మ ఆడించారు. ధాన్యాన్ని తరలించారు. క్రూరంగా హింసించారు. దేశ చరిత్రలో ఇంతటి దారుణాలు జరిగినా, స్వాతంత్య్ర పోరాటం కారణంగా అవన్నీ మరుగున పడిపోయాయి. మరోవైపు నిజాం, భారత, పాకిస్థాన్‌ దేశాలు రెంటితోనూ తాను కలవబోనని, స్వతంత్రంగా ఉంటానని ప్రకటించాడు. ఓ దశలో పాక్‌లో కలవడానికి కూడా సంసిద్ధత ప్రకటించాడు. భారత ప్రభుత్వంతో ఆ విషయమై చర్చలు, వాదాలు సాగుతూ ఉండగానే, మరో వైపు కమ్యూనిస్టుల పోరాటం సాగుతూ ఉన్న దశలోనే, భారత ప్రభుత్వం సైనికచర్య జరిపింది. నిజాం లొంగిపోయాడు. నిజాం లొంగుబాటు సాజావుగా సాగలేదు. ఆనాటి హోంమంత్రి వల్లభాయ్‌ పటేల్‌ సైనిక చర్య తీసుకుని ఉండకపోతే హైదారాబాద్‌ సంస్థానం చరిత్ర కశ్మీర్ లా ఉండేది.
గాంధీతో సహా కాంగ్రెస్‌ ఆనాడు ఇక్కడి ప్రజల గురించి పట్టించు కోలేదు. ఇక కమ్యూనిస్టులు చేసింది భూస్వామ్యానికి వ్యతిరేకంగా భూమికోసం విముక్తి పోరాటం మాత్రమే. అయితే రజాకార్ల దాష్టీకంపై ప్రజలు సాయుధులై సమాయత్తం అయినప్పుడు అంతా కలసి కదిలారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి జరిగిన విముక్తి పోరాటం కావడంతో ప్రజల్లో సహజంగానే ఆనందం వెల్లి విరిసింది. బానిస సంకెళ్లు తెగినందుకు సంతోషించారు.
అయితే ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ, రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రంగా వ్యతిరేకించినా హైదరాబాద్ న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్‌టన్‌ని కొనసాగించడమే ఇందుకు నిదర్శనం. ఇక రజాకార్లలోనూ ముస్లింలతో పాటు శ్యామ్ సుందర్, బి.ఎస్.వెంకటరావు, పీసరి వీరన్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో ముస్లింలుగా మారిన దళితులు, దొరలు, భూస్వాములు వారి అనుచరగణం కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గాన్ని తప్పుపడతారు? అప్పటి పరిస్థితులను బట్టి సాగిన చరిత్ర అది. అంతే! దాన్ని వక్రీకరించే అర్హత, హక్కు ఎవరికీ లేదు.
పార్టీలు, ప్రభుత్వాలు, తెలంగాణ విమోచన అనగానే ఉలిక్కిపడుతున్నారు. ఏదో పేరు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోవడానికి జంకుతున్న నేతలు ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. మనిషన్నాక, పాలన అన్నాక మంచీ, చెడూ ఉంటుంది. నిజాం చేసిన మంచిని కీర్తించినట్లే, చెడును కూడా చీల్చి చెండాడాల్సిందే. ఒక్క హైదరాబాద్ నగరానికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు, యూనివర్సిటీ, హాస్పిటల్స్ ఇలా ఆయన చేసిన మంచిని ఎవరూ కాదనలేరు. ఆనాడు నిజాం నిరంకుశాలను, రజాకార్ల ఆగడాలను ఎదరించడానికి జరిగిన సాయుధ పోరాటం ముమ్మాటికి తిరుగబాటు చరిత్రే. చైనా సాంస్కృతిక, రష్యా బోల్షివిక్ పోరాటలకు ఇది ఏమాత్రం తక్కువ కాదు.
తెలంగాణకు విముక్తి జరిగిన సెప్టెంబర్‌ 17న విమోచన ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆకాంక్షలను గత ప్రభుత్వాలతో పాటు, ప్రస్తుత ప్రభుత్వం కూడా విస్మరించడం ద్వారా చరిత్రను అపహాస్యం చేస్తూ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినం అన్నింటికీ అతీతంగా మనమంతా కలిసి జరుపుకోవాల్సిన స్వాతంత్ర్యదినోత్సవం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. గర్వకారణం. చారిత్రక వాస్తవం. మన చరిత్రను మన భవిష్యత్తు తరాలకు చదువు, పాఠ్యాంశాలు, బోధనలు, పుస్తకాలు వంటి ప్రక్రియల ద్వారా అందించడం మనందరి బాధ్యత.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News