ఇగిప్పుడు పెంకుటి0డ్లు కొత్తగ ఎవలూ కట్టుకోకపోయినా, పాత ఇండ్లు ఇంకా శాననే ఉన్నయి. కొందరైతే, పాత ఇండ్లను కొత్తగా, కొత్త ఇండ్లను పాత లెక్కల కూడా కట్టుకుంటాండ్లు. గట్లైతే, గా పెంకుటిండ్ల కు మస్తు గిరాకీ ఉన్నది. గట్లనే మరి గా పెంకుటిండ్లకు కొంచెం రచ్చణ కరువే. ఆన వత్తే కురుత్తయి. కోతులు ఆగం శేత్తయి. మరి గివ న్నీటి నుండి రచ్చణకు గూడ ఓ ఉపాయం ఆలోసి0చిండ్రు. గది ఏందంటే?!

గా పెంకల రచ్చణకు ఒక పౌడర్ వచ్చింది. గా పౌడర్ ను కలపాలె. ఐటెంక పౌడర్ ని పెంకుల మీద స్ప్రే కొట్టాలె. ఇగ గదా0తోటి పెంకలు గట్టి పడతయి. పెంకల మధ్య సందులు ఉంటే పోతయి. వానొత్తే కురవదు. ఎండకు సల్లగ ఉంటయి. అన్నట్టు ఎట్లుంది గీ ఆలోశన? మరి మీరూ ఓ పాలి శేయ0డ్రి. పాత పెంకుటిల్లు కొత్త గ ఉంటది.

