Tuesday, November 24, 2026
22.2 C
Hyderabad

దక్షిణ భారతానికే తలమానికం…|PALAKURTHI|AKHANDA JYOTHI|SLNS TEMPLE

పాలకుర్తి క్షీరగిరిపై నేడే అఖండ జ్యోతి

తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని పాలకుర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివకేశవులు ఒకే కొండపై పక్కపక్కనే ఉన్న రెండు సహజ సిద్ధమైన గుహల్లో స్వయంభువులుగా కొలువుదీరిన అరుదైన హరిహర క్షేత్రం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఈ సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి(10-11-2026) నుండి కార్తీక బహుళ అమావాస్య(08-12-2026) వరకు ఈ క్షీరగిరి క్షేత్రంలో నెలరోజుల పాటు విశేష పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు . కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించి, భక్తిశ్రద్ధలతో స్వామివార్లను అర్చించినా, అభిషేకించినా సకల పాపాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ రోజు వచ్చే ధాత్రి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అరుణాచలం, శబరిమల సరసన పాలకుర్తి

పాలకుర్తి కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనది, భక్తులను మంత్రముగ్ధులను చేసే అద్భుత ఘట్టం కొండపైన వెలిగించే అఖండ జ్యోతి దర్శనం. కేరళలోని శబరిమల మకర జ్యోతి, తమిళనాడులోని అరుణాచలం అగ్ని జ్యోతి తర్వాత దక్షిణ భారతదేశంలో అఖండ జ్యోతిని నిర్వహిస్తున్న మూడవ ప్రముఖ దేవస్థానంగా పాలకుర్తి క్షేత్రం చరిత్రకెక్కింది. కార్తీక పౌర్ణమి నాడు కొండ శిఖరంపై వెలిగించే ఈ దివ్య జ్యోతి చుట్టుపక్కల ఉన్న సుమారు ఇరవై ఐదు గ్రామాలకు స్పష్టంగా దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ మంగళవారం నాడు మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామీ దుర్గానందపురి మహరాజ్ దివ్య హస్తాల మీదుగా ఈ అఖండ జ్యోతి ప్రజ్వలన మహోత్సవం జరగనుంది. ఆ చీకటి రాత్రిలో కొండపై ప్రజ్వలించే దివ్య కాంతిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

గిరి ప్రదక్షిణ, లక్ష దీపాల కాంతుల్లో ఆధ్యాత్మిక పారవశ్యం

కార్తీక పౌర్ణమి రోజున పాలకుర్తి క్షేత్రం భక్తజన సంద్రంగా మారనుంది. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక రుద్రాభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, గోపూజ, ధాత్రి నారాయణస్వామి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. భక్తులు తెల్లవారుజాము నుండే పవిత్ర గిరి ప్రదక్షిణలో పాల్గొని, శివకేశవ నామస్మరణతో కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణమంతా లక్షదీపోత్సవంతో దేదీప్యమానంగా వెలిగిపోనుంది. మహిళలు, భక్తులు మట్టి ప్రమిదలలో చిరు దీపాలు వెలిగించి, ఆలయ మెట్లపై, ప్రాంగణంలో అందంగా అమర్చడంతో ఆ కొండ ప్రాంతమంతా నేలపైకి దిగివచ్చిన నక్షత్ర లోకంలా కనువిందు చేస్తుంది. చిరు దీపం వెలిగించి అఖండ జ్యోతిని దర్శించుకుంటే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

మొక్కులు తీర్చే కొంగుబంగారం…

పాలకుర్తి క్షీరగిరిపై కొలువైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకాన్ని చూరగొంటూ, నిత్యం భక్తుల పూజలందుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి వేళ అఖండ జ్యోతి దర్శనం కోసం తరలివచ్చే భక్తులతో క్షీరగిరి పుణ్యక్షేత్రం భక్తిపారవశ్యంలో మునిగిపోనుంది. కొండ శిఖరంపై వెలిగే అఖండ జ్యోతి కేవలం దీపం కాదు.. భక్తుల విశ్వాసానికి ప్రతీక, ఆధ్యాత్మిక చైతన్యానికి సంకేతం. ఆ జ్యోతి కాంతుల్లో హరిహరుల దివ్య దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకుని, మనసారా వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయనే విశ్వాసంతో భక్తులు క్షీరగిరికి చేరుకుంటున్నారు.

……

భక్తుల సౌకర్యార్థం సర్వం సిద్ధం

కార్తీక మాస ఉత్సవాలకు, నేడు జరిగే కార్తీక పౌర్ణమి మహా క్రతువుకు విచ్చేసే భక్తుల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, వసతి మరియు ప్రత్యేక పూజల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ వైభవోపేతమైన అఖండ జ్యోతి ప్రజ్వలన, లక్షదీపోత్సవం, గోపూజ మరియు ధాత్రినారాయణస్వామి పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, శివకేశవుల కృపాకటాక్షాలకు పాత్రులు కావాలి

-భాగం లక్ష్మీప్రసన్న
ఆలయ కార్యనిర్వాహణాధికారి

……

భక్తి పరవశంతో అఖండ జ్యోతి ముందు ప్రార్థన చేసినవారికి అనుగ్రహం లభిస్తుంది. ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగించడం మన సంస్కృతికి గర్వకారణం. శ్రీ సోమేశ్వర స్వామి ఇలవేలుపు భక్తుడికి దశాబ్ద కాలం క్రితం స్వామి వారు స్వప్నం లో సాక్షాత్కరించి అరుణాచలం వలె క్షీరగిరి పైన కూడా అఖండ జ్యోతి వెలిగించమని కోరగా ఆ భక్తుడు గత 12 సంవత్సరాల క్రితం ఆరంభం చేసిన ఈ కార్యక్రమం నేటికి 12 వ వార్షిక ఉత్సవం గా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం

-దేవగిరి రమేష్ శర్మ
ఆలయ ఉప ప్రధాన అర్చకులు

……

అఖండ జ్యోతి ప్రజ్వలన సమయంలో వాయు, అగ్ని, ఆకాశం తత్త్వాలు సమతుల్యమవుతాయి. ఆ దివ్య శక్తిని అనుభవించడం భక్తుల పుణ్యం. కార్తీక పౌర్ణమి రోజున దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి, దీపారాధన చేసి, అఖండ జ్యోతి దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం

-దేవగిరి అనిల్ శర్మ
ఆలయ అర్చకులు

……

అఖండ జ్యోతి కేవలం దీపం కాదు, అది దైవానుగ్రహానికి ప్రతిరూపం. ఇక్కడ పూజించిన ప్రతి ఒక్కరికీ శాంతి, సంపద, ఆరోగ్యం లభిస్తాయి కావున భక్తులు హాజరై పాలకుర్తి స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని తరించండి.

-మత్తగజం నాగరాజు శర్మ
ఆలయ అర్చకులు

Latest News

సరైన దారులు వెతకాలి!?|EDITORIAL

ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం చుక్కలనంటుతున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్ల పెంపే పరిష్కారం కాదు. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వాలు...

నవంబర్ 24, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 06.00గం లకు తిధి శు పౌర్ణమి రాత్రి 08.57 వరకు నక్షత్రం కృత్తిక రాత్రి 12.57 వరకు ఉపరి రోహిణి యోగం పరిఘ సాయంత్రం 05.47 వరకు ఉపరి...

నవంబర్ 23, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 10.43 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం భరణి రాత్రి 02.07 వరకు ఉపరి కృత్తిక యోగం వరీయాన్ రాత్రి 08.45 వరకు ఉపరి పరిఘ కరణం తైతుల రాహుకాలం గరజి ఉదయం...

ప్రజాపాలన పట్టు తప్పుతోందా?|CONGRESS|TELANGANA|CM|REVANTH REDDY

-అడుగు ప్రత్యేకం పార్టీ తప్పటడుగులతో తడబడుతోందా? కాంగ్రెస్ లో ఎందుకీ కస్సు బుస్సులు! సీఎం వర్సెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళపై సిద్ధిపేటలో సీఎం సీరియస్ కాంగ్రెస్ లో వివాద వ్యాఖ్యల కలకలం వాళ్ళ వ్యాఖ్యలు సరే, మరి చర్యలేవి? వారి సామాజికవర్గాలే సమస్యా? సురేఖకు...

రోజుకు 5యేలు! 7ఏండ్లకు జరిమానా!?|ADUGU TRENDS

మనం బ్యాంకుల్ల బాకీలు తెచ్చుకుంటం. ఏదన్న కుద పెట్టకపోతే గవాల్లు గా బాకీలియ్యరు. గట్ల బాకీ తీర్సినంక కుద పెట్టిన పేపర్లియ్యకపోతే గా అదాలత్ ఏం శేసిందో సూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ల అలీగడ్ కు...

ఢిల్లీ సుల్తానులు|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|EDUCATION

ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో...

భారత్ కు సవాల్ గా పాక్, చైనా వ్యూహాలు!?|EDITORIAL

పాకిస్తాన్ కు చైనా అండదండలు. భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాలు! డ్రాగన్ ద్వంద్వ నీతిపై అమెరికా నివేదిక సంచలన వ్యాఖ్యలు. ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు భారత్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి! మార్గం - అడుగు,...

వార/ఈ రోజు రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా...

వలెయ్యకుండనే శేతికి లచ్చల శేపలు!?|ADUGU TRENDS

ఎన్కటికి వట్టి శేపల కూర వడిపిల్ల మెతుకులని మస్తు తినేటోల్లు. ఇప్పటికీ శేపలంటే కొందరు శెవులు కోసుకుంటరు. రుశికి రుశి, ఆరోగ్యానికారోగ్యం. గా కౌసుకు, ముండ్లకు భయపడ్తరు గనీ, గాదాన్ని కాదంటే, గా...

నగరానికి గోదావరి జలాలు పరిష్కారమేనా?|EDITORIAL

హైదరాబాద్‌కు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. పైప్‌లైన్ పనులు, ట్రయల్ రన్ విజయవంతమై, నీటి పంపిణీ సమర్థంగా జరగాలి. మరోవైపు వర్షపు...

నవంబర్ 21, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం చిలుకు ద్వాదశి తులసి వివాహం చాతుర్మాస్య వ్రతసమాప్తి తిధి శు ద్వాదశి రాత్రి 01.16 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 03.24 వరకు ఉపరి అశ్విని యోగం సిద్ది రాత్రి 12.55...

ఆకరి సూపు కోసం అవ్వ శవం ఎదురు సూత్తాంది!?|ADUGU TRENDS

తలంత బలగం, తలకు పోసే దిక్కులేకుండా పోయిందనే సామెత గా అవ్వకు బాగా అతికింది. గా తల్లికి ఇద్దరు బిడ్డలు. బంధుగులు కూడా ఉన్నరు. కానీ, గవాల్లంతా గిప్పుడు యాడున్నరో తెలవదు. 40...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News