గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్న అధికారులను, గిరిజన నాయకులను ఆదేశించారు. ఈ నెల 15న జరుగనున్న జయంతి వేడుకల సందర్భంగా పాలకుర్తి తహసిల్దార్ కార్యాలయంలో సంత్ సేవాలాల్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గిరిజన నాయకులతో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకన్న మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవం అన్నారు. రాజకీయాలకతీతంగా జయంతి వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. పాలకుర్తి ఖుషి గుట్ట సమీపంలోని సేవాలాల్ నిర్మాణ మందిరం వద్ద భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు పొట్టబత్తుల శ్రీనివాస్, చంద్రమోహన్, శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ ఐ రాకేష్ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

