Saturday, April 11, 2026
26.7 C
Hyderabad

అచ్చంపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

మాచారంలో భావోద్వేగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. “నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నిలబడి మాట్లాడటం నాకు గర్వకారణం” అంటూ తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు విశేష ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే అధికారులకు తగిన సూచనలు చేశామని, రైతుల పక్షాన పోరాడే ప్రభుత్వంగా నిలుస్తామని స్పష్టం చేశారు.

పోడు భూముల విషయంలో గత ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేస్తూ, పోరాడిన వారిని జైలుకు పంపిన చరిత్ర వారి దెబ్బతిన్న పాలనకు నిదర్శనమని అన్నారు. ఇక తమ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో వ్యవసాయం చేయేందుకు సోలార్ పంపుసెట్లు అందించడం ద్వారా రైతులకు బలాన్నిచ్చామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి రైతుకూ సోలార్ పంపుసెట్ అందించేలా చర్యలు చేపట్టామని, రాబోయే వంద రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ.60 వేల కోట్లను ఖర్చు చేసిందని సీఎం గుర్తు చేశారు. ముఖ్యంగా సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడం, పేదలందరికీ సన్న బియ్యం సరఫరా చేయడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు అవకాశాలిచ్చామని, ఆడబిడ్డలను RTC బస్సులకు యజమానులుగా చేస్తూ వారి ఆధిక్యాన్ని చాటామన్నారు. వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యత అప్పగించిన ఘనత తమదేనన్నారు. ఆదానీ, అంబానీలకు పోటీగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని, 60 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలుపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. కేంద్రం సైతం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉంచిన రాష్ట్రంగా తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

చివరిగా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని పట్టించుకోనని, పథకాలను అనుభవించే ప్రజలే తమకి న్యాయమైన సమాధానమని స్పష్టం చేశారు. రుణమాఫీ, ఉచిత బస్సులు, విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు గుర్తుండిపోతాయని, తప్పుడు ప్రచారాలు ప్రజలను మోసగించలేవని అన్నారు. “ఇందిరమ్మలా, నేను కూడా ప్రజల గుండెల్లో నిలవాలన్నదే నా లక్ష్యం” అంటూ ప్రసంగాన్ని ముగించారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News