సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో లబ్ధిదారులు మాట్లాడారు. తులం బంగారం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తమ సందేహాలను ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ఎన్నికల ముందు తులం బంగారం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై ఏడాది గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, లబ్ధిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. హామీలను నెరవేర్చడంలో ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. తులం బంగారంపై ఉన్న ప్రజల ఆశలను నెరవేర్చేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

