Sunday, September 13, 2026
26.2 C
Hyderabad

Minister|మంత్రి Sridharbabu|శ్రీధర్ బాబుకు ఆటా|ATA ఆహ్వానం|INVITATION

రెండు రాష్ట్రాల్లో డిసెంబర్ 12–27 సేవా-సాంస్కృతిక ఉత్సవాలు|TELANGANA|ANDHRA PRADESH

ATA మహాసభల ఏర్పాట్లు వేగవంతం

అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ (ATA) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు–యువజన సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారి నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ మహాసభలకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఆటా అధ్యక్షుడు జయంత్‌ చల్లా, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్‌ ఈశ్వర్‌ బండా హైదరాబాద్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రం అందించారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రవాస వ్యాపారవేత్తలు, ఐటీ నిపుణులు, స్టార్టప్ ఇన్నోవేటర్లు, యువత అధిక సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో ఈ మహాసభలు అమెరికా–తెలంగాణ మధ్య సాంకేతిక, వ్యాపార అనుబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తాయని వారు మంత్రికి వివరించారు.

ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, యూత్ కాన్ఫరెన్స్‌లు, బిజినెస్ సమ్మిట్‌లు, NRI సదస్సులు వంటి వైవిధ్యభరితమైన సెషన్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రవాస తెలుగు ప్రతిభ, నూతన ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసే అపూర్వ వేదికగా ఈ మహాసభలు నిలుస్తాయని వారు తెలిపారు. అదేవిధంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ATA చేపడుతున్న సేవా కార్యక్రమాల భాగంగా డిసెంబర్ 19న హైదరాబాద్ టీ–హబ్‌లో నిర్వహించనున్న బిజినెస్ సెమినార్‌కు కూడా మంత్రి శ్రీధర్‌బాబు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశం ద్వారా స్టార్టప్‌లకు అంతర్జాతీయ అవకాశాలు, పెట్టుబడిదారులతో నెట్‌వర్కింగ్ అవకాశాలు లభిస్తాయని వివరించారు.

ఇక ATA ప్రతి ఏడాది భారత్‌లో నిర్వహించే సాంస్కృతిక–సాహిత్య ఉత్సవాలు ఈసారి డిసెంబర్ 12 నుంచి 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆటా ప్రతినిధులు జూబ్లీహిల్స్ తాజ్ మహల్ హోటల్‌లో సీనియర్ జర్నలిస్టులతో సమావేశమై వేడుకల వివరాలను వెల్లడించారు. ఈ పదిహేనురోజుల కార్యక్రమాల్లో సంగీతం, నృత్యం, సాహిత్యం, సేవ, చరిత్ర, సంప్రదాయాలు, ప్రవాస తెలుగు సంస్కృతి ప్రతిబింబించే ప్రదర్శనలు చోటుచేసుకోనున్నాయి. అమెరికా నుంచి పలువురు కళాకారులు, రచయితలు, రంగస్థల కళాకారులు, తెలుగు వలసకారుల సంఘాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొననుండటం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు, కళాకారులు, యువత, మరియు తెలుగు సంఘాలు విస్తృతంగా పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకలు అమెరికా–తెలుగు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేస్తాయని వారు చెప్పారు. ఈ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం అందించి, ప్రజల్లోకి పెద్దఎత్తున చేరేలా చేయాలని మీడియాకు ఆటా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలువురు ప్రధాన మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News