Sunday, September 27, 2026
25.2 C
Hyderabad

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు.

మతాల పుట్టుకకు కారణాలు

వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు) చీలిపోయారు. ఈ నాలుగు వర్ణాలకు చెందనివారందరిని పంచమ వర్ణంగా పరిగణించారు. ఈ వర్ణం వారిని అత్యంత హేయమైన అంటరానివారిగా సమాజానికి దూరంగా జీవించేవారు. కుల వ్యవస్థ ఆధారంగా సమాజంలో నాలుగవ వర్ణమైన శూద్రులను, పంచమకులం వారిని సామాజిక వివక్షత మరియు లింగ వివక్షతకు గురిచేశారు. బ్రాహ్మణ ఆధిపత్యం, మహిళల స్వేచ్ఛ హక్కులను ప్రాముఖ్యత, లింగ సమానత్వాన్ని బోధిస్తూ సమాజంలో మతాలు ఆవిర్భవించాయి. వైదిక మతాల ఆధారంగా యజ్ఞయాగాలు కేవలం ఆధిపత్య వర్ణం వారికే చెందడం వల్ల సమాజంలో దిగువ వర్గం వారికి, ఎగువ వర్గం వారికి ఆర్ధిక సంక్షోభాన్ని కూడా సృష్టించాయి (యజ్ఞయాగాలు ఖర్చుతో కూడుకున్నవి). షోడశ కర్మలు చేసినవారికి మాత్రమే మోక్షం లభిస్తుందని జనాభాలో అత్యధికులైన స్త్రీలు మరియు శూద్రులు మోక్షానికి అనర్హులని ప్రకటించి వైదిక మతాన్ని సామాన్యులకు దూరం చేశారు. ఈ కాలంలో ముఖ్య మతాలైన బౌద్ధ, జైన సమానత్వానికి ప్రాధాన్యతనిస్తూ మోక్షం అందరికీ సమానం, సాధ్యమని ప్రకటించి సామాన్యులకు దగ్గరయ్యాయి. వీటి గురించి క్లుప్తంగా బౌద్ధ గ్రంథమైన అంగుత్తరనికాయ (పాళీ భాష)లో స్పష్టానంగా రచించబడ్డాయి. బౌద్ధ, జైన మతాల ఆవిర్భావానికి ఆనాటి స్వతంత్ర రాజ్యాలు కూడా దోహదపడ్డాయి. బౌద్ధ మతానికి చెందిన గౌతమ బుద్ధుడు మరియు జైన మతానికి చెందిన వర్ధమాన మహావీరుడు కూడా స్వతంత్ర రాజ్యాలకు చెందినవారే.

పైన తెలియచేసిన సామాజిక, ఆర్ధిక, మత పరిస్థితులు బౌద్ధ, జైన మత ఆవిర్భావానికి కారణమైయ్యాయి. వీటికి రాజుల ఆదరణ మరియు ప్రచార సంఘాల కృషి వలన దేశవ్యాప్తంగా అభివృద్ధిచెందాయి.

భారతదేశంలో ఆవిర్భవించిన అవైదిక (వైదిక మతం కాని) మరియు బ్రాహ్మణ వ్యతిరేక మతాల్లో బ్రాహ్మణా వ్యతిరేక మతాల్లో బౌద్ధం మతం అత్యంత ముఖ్యమైనది. ఈ మతం బుద్ధుని యొక్క బోధనల ద్వారా స్థాపించబడింది.

గౌతమ బుద్ధుడు (క్రీ.పూ.566-486)

గౌతమ బుద్ధుడు నేపాల్ పర్వత ప్రాంతంలో కపిలవస్తు నగరంలో క్రీ.పూ.566 లో శాక్య తెగలో (క్షత్రియ వంశానికి చెందినది) జన్మించాడు. తండ్రి పేరు శుద్ధోదనుడు. ఇతను కపిలవస్తు ప్రాంతానికి ఎన్నికల పరిపాలకుడిగా విధులు నిర్వర్తించేవాడు. తల్లి కోసల. రాజపుత్రిక. గౌతముడు కూడా రాజవంశానికి చెందినవాడే కాబట్టి ప్రజాతంత్ర, సమానత్వ భావాలు వారసత్వంగా వచ్చాయి. గౌతమ బుద్ధుడు పదహారేళ్ళ వయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. బుద్ధుని (బుద్ధుడు అనగా జ్ఞానం పొందినవాడని అర్థం) అసలు పేరు సిద్ధార్థుడు. అలరకలాయ, రుద్రక బుద్ధుడికి వేద విద్యను నేర్పారు. బుద్ధుని జీవితంలో గల అయిదు ప్రధాన సంఘటనలను పంచమహాకళ్యాణములు అంటారు. అవి 1) జననం, 2) మహాభినిష్క్రమణ, 3) సంబోధి, 4) ధర్మ చక్ర పరివర్తన, 5) మహాపరినిర్వాణ. ఈ పంచమహాకళ్యాణములకు 5 గుర్తులు కూడా ఉన్నాయి.

1) జననం : బుద్ధుడు నేపాల్ లోని లుంబినిలో జన్మించాడు. దీనికి గుర్తు తామరపువ్వు.
2) మహాభినిష్క్రమణ : బుద్ధుడు ఇంటిని విడిచి 29వ యేట సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. సమాజంలో వృద్ధుడు, రోగి, శవం మరియు సన్యాసిని చూసిన బుద్ధుడి మనసు వికలమై తన ప్రాపంచిక జీవితాన్ని వీడి సన్యాసాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. కంఠక అనే గుర్రాన్ని అధిరోహించి ఇంటి నుండి నిష్క్రమించడం వల్ల ఆ గుర్రమే దీనికి గుర్తుగా పరిగణిస్తారు.
3) సంబోధి : బుద్ధుడు జ్ఞానోదయం పొందిన సంఘటనను సంబోధి అంటారు. ఇది గయలోని ఫాల్గు నది ఒడ్డున బోధి వృక్షం (రావి చెట్టు) కింద 35వ యేట జ్ఞానోదయం కలిగింది. బౌద్ధులకు పవిత్రమైన బోధి చెట్టు దీనికి గుర్తు.
4) ధర్మ చక్ర పరివర్తన : గౌతమ బుద్ధుని తొలి బోధనను ధర్మ చక్ర పరివర్తన అంటారు. ఇది సారనాధ్ లోని జింకల వనంలో జరిగింది. దీనికి కొండన, భదీయ, వప్ప, మహనామా, అస్సగి అనే అయిదుగురు శిష్యులు తొలి బోధనకు హాజరయ్యారు. ఈ సారనాధ్ నే బౌద్ధమత జన్మస్థలంగా భావిస్తారు. దీనికి గుర్తు 8 ఆకులు కలిగిన ధర్మచక్రం.
5) మహాపరినిర్వాణ : గౌతమ బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేస్తూ 80వ యేట కుషి నగరంలో (ఉత్తర్ ప్రదేశ్) మరణించాడు. దీనినే మహాపరినిర్వాణ అంటారు. బుద్ధుడు సుమారు 45 ఏళ్ళ పాటు తన బోధనలను ప్రచారం చేసాడు. దీనికి గుర్తు స్థూపం.

బౌద్ధమత బోధనలు:

గౌతమ బుద్ధుడు 4 సత్యాలను తెలియచేసాడు.
1) ప్రపంచమంతా దుఃఖమయం.
2) కోరికలే దుఃఖానికి కారణం.
3) దుఃఖాన్ని నిరోధించవచ్చు.
4) దుఃఖాన్ని నిరోధించడానికి మార్గం ఉంది.
బౌద్ధ మతంలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం అష్టాంగ మార్గం. దీని ద్వారా కోరికలను అదుపు చేసి దుఃఖాన్ని జయించవచ్చు. అవి 1) సరైన క్రియ, 2) సరైన దృష్టి, 3) సరైన వాక్కు, 4) సరైన లక్ష్యం, 5) సరైన మార్గం, 6) సరైన జీవనోపాధి, 7) సరైన చైతన్యం, 8) సరైన ధ్యానం.

ప్రత్యుత్తసముప్పద : బౌద్ధ మత సిద్ధాంతాల్లో ఇది కార్యాచరణ సంబంధం గురించి తెలియచేస్తుంది. దీని ప్రకారం కారణం మరియు ఫలితం లేకుండా ఏ మానవ చర్య జరగదు.

బౌద్ధ మతంలో నాలుగు ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. అవి రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం, కాశ్మీర్ లోని కుందలవనంలలో ఈ సమావేశాలు జరిగాయి. వైశాలి నగరంలో జరిగిన రెండవ సమావేశంలో బౌద్ధ మతం సుమారు 18 శాఖలుగా విడిపోయింది. కాశ్మీర్ లోని కుందలవనంలో జరిగిన సమావేశంలో ఈ 18 శాఖలు మహాయానం, హీనయానం అనే రెండు శాఖలుగా ఏర్పడ్డాయి.

బౌద్ధమత పవిత్ర గ్రంథాలు : 1) సుత్తపీటక , 2) అంగుత్తరనికాయ, 3) సంయుక్తనికాయ, 4) ఖుద్దక నికయ, 5) అభిదమ్మ పీటక, 6) వినయ పీటక.

ప్రాచీన కాలంనాటి బౌద్ధమత పండితులు : ఆచార్య నాగార్జునుడు, మైత్రేయనాథుడు, బుద్ధఘోషుడు, దిజ్ఞాగుడు, ధర్మకీర్తి.

బానోత్ కళ్యాణ్

Latest News

గీ యినాయకునికి.. నిమజ్జనమే లేదు!?|ADUGU TRENDS

పతి ఏటా యినాయకులను పతిష్టించి, పూజించి, కోటొక్క తీర్గ కొలిచి సివరాకరికి నిమజ్జనం చేస్తుంటం. కానీ, గీ యినాయకునికి నిమజ్జనమే లేదు!? ముంబై గిర్గావ్ లో ఓ గణేశ్ మండలి గీ సంప్రదాయాన్ని...

కత్తులు దూసిన చేతులే.. కరచాలనం!|EDITORIAL

నిన్నటి వరకు పరస్పరం సుంకాలు, ఆంక్షలు, హెచ్చరికలతో ఢీకొన్న అమెరికా–చైనా.. ఒక్కసారిగా ఆత్మీయ ఆలింగనంలో కనిపించాయి. శత్రువుల్లా కనిపించిన రెండు అగ్రశక్తుల అధినేతలు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది....

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 03 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న...

ఇగ్రహం ఉన్న సోటనే నిమజ్జనం!|ADUGU TRENDS

ప్రతి ఏటా ఇనాయకులను నిలబెడత0.. తొమ్మిది, పది రోజులు ఘనంగా పూజలు సేస్త0. ఇగ గా ఇగ్రహాలను చెరువుల్ల, కుంటల్ల నిమజ్జనం సేస్త0. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సేసే గా...

సర్ వివాదం.. ఈసీ విశ్వసనీయతకు సవాల్!|EDITORIAL

ఓటు ప్రజాస్వామ్యానికి ఆయుధం.. ఆ ఓటుకు కాపలాదారు ఈసీ! మరి కాపలాదారుడి విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తితే? సర్ వివాదాలు, కమిషనర్ల అభ్యంతరాలు, ప్రతిపక్షాల ఆరోపణల నడుమ.. ఎన్నికల సంఘం పారదర్శకత ఇప్పుడు దేశం...

సెప్టెంబర్ 26, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 09.45 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం11.50 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం గండ పగలు 02.41 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 09.48 వరకు ఉపరి బవ రాహుకాలం...

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026) ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు...

మూడో బిడ్డకు బంపర్ ఆఫర్!?|ADUGU TRENDS

ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత...

శాశ్వత సభ్యత్వంలో భారత్ ముందడుగు!?|EDITORIAL

భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్‌ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్‌ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి...

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News