Saturday, September 5, 2026
27.6 C
Hyderabad

బంగారం ధరలను నిర్ణయించేదెవరు?|EDITORIAL

బంగారం మనిషి జీవనంలో అత్యంత విలువైన లోహంగా నిలిచింది. ఇది కేవలం ఆభరణాలకే కాకుండా ఆర్థిక వ్యవస్థలో, పెట్టుబడులలో, అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా కీలకం. మరి బంగారం ధరలను ఎవరు? ఎలా నిర్ణయిస్తారు? అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న? మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

బంగారం మనిషి జీవనంలో అత్యంత విలువైన లోహంగా నిలిచింది. ఇది కేవలం ఆభరణాలకే కాకుండా ఆర్థిక వ్యవస్థలో, పెట్టుబడులలో, అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి బంగారం ధరలను ఎవరు? ఎలా నిర్ణయిస్తారు? అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న?

నిజానికి, బంగారం ధరను ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి నిర్ణయించరు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ శక్తులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డిమాండ్, సరఫరా నిష్పత్తి, కరెన్సీ మార్పిడి రేట్లు, ప్రభుత్వాల విధానాల, పెట్టుబడిదారుల మనస్తత్వం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలను ‘లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్’ అనే సంస్థ నిర్ణయిస్తుంది. ప్రతి రోజూ రెండుసార్లు, ఉదయం, సాయంత్రం లండన్ సమయం ప్రకారం బంగారం ధరను “లండన్ గోల్డ్ ఫిక్సింగ్” ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా ‘హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, గోల్డ్ మన్ సాక్స్’ వంటి పెద్ద అంతర్జాతీయ బ్యాంకులు, బులియన్ వ్యాపారులు పాల్గొంటారు. వీరు తమ తమ కస్టమర్ల డిమాండ్, సరఫరా వివరాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు. ఇది ప్రపంచ బంగారం ధరలకు ప్రామాణికంగా పరిగణిస్తారు.

బంగారం ధరలను ప్రభావితం చేసేది అమెరికా డాలర్ విలువ. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరను డాలర్లలోనే నిర్ధారిస్తారు. ‘డాలర్ విలువ తగ్గినప్పుడు, బంగారం ధర పెరుగుతుంది’, అదే ‘డాలర్ బలపడినప్పుడు, బంగారం ధర తగ్గే’ అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే, బంగారం “సురక్షిత పెట్టుబడి.” అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారం రూపంలో పెట్టడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు, యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, స్టాక్ మార్కెట్ పతనం వంటి పరిస్థితుల్లో బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి.

మరొక ప్రధాన అంశం డిమాండ్-సరఫరా నిష్పత్తి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి ఎక్కువగా దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, అమెరికా వంటి దేశాల్లో జరుగుతుంది. కానీ వినియోగం విషయంలో భారత్, చైనా, మధ్య ప్రాచ్య దేశాలు ముందుంటాయి. భారతదేశంలో బంగారం పట్ల ఉన్న ప్రేమ, ఆచారాలు, వివాహాల సందర్భాలు, పండుగలు మొదలైనవి బంగారం డిమాండ్‌ను అధికంగా ఉంచుతాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. సరఫరా అధికంగా ఉన్నప్పుడు ధరలు తగ్గుతాయి.
అదేవిధంగా, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి సంస్థలు వడ్డీ రేట్లను పెంచినప్పుడు లేదా తగ్గించినప్పుడు బంగారం ధరలు మారుతాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆర్థిక సాధనాల (బాండ్లు, డిపాజిట్లు)లో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా భావిస్తారు, దాంతో బంగారం ధరలు తగ్గుతాయి. అదే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, బంగారం ఆకర్షణీయ పెట్టుబడి రూపంగా మారి ధరలు పెరుగుతాయి.

స్థానికంగా చూస్తే, దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలకు అనుసంధానమై ఉంటాయి. అయితే వాటికి రూపాయి విలువ, పన్నులు, ఖర్చులు వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర మారకపోయినా దేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుతుంది. ఎందుకంటే రూపాయలలో కొనుగోలు చేయాల్సిన బంగారం మరింత ఖరీదుగా మారుతుంది. అదేవిధంగా, ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాలు, జీఎస్టీ వంటి పన్నులు కూడా స్థానిక ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.

మరొక ముఖ్యమైన అంశం భావోద్వేగాలు, మార్కెట్ సైకాలజీ. బంగారం పట్ల ప్రజల విపరీతమైన మక్కువ. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు, బంగారంను భద్రతగా భావిస్తారు. ఈ నమ్మకం బంగారం ధరలను క్రమం తప్పకుండా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, పెద్ద పెట్టుబడిదారులు లేదా “గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్”లో జరిగే లావాదేవీలు కూడా తాత్కాలికంగా ధరలలో హెచ్చుతగ్గులు కలిగిస్తాయి. బంగారం ధరల నిర్ధారణలో సాంకేతిక పరిణామాలు కూడా ఇటీవల పెద్ద పాత్ర పోషిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బంగారం వ్యాపారం ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ల ద్వారా జరుగుతోంది. ఈ కారణంగా మార్కెట్ ప్రతిస్పందన వేగంగా మారుతుంది. అలాగే క్రిప్టో కరెన్సీల ప్రభావం కూడా కొంతవరకు బంగారం డిమాండ్‌పై చూపిస్తోంది. పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. అయినప్పటికీ, బంగారం శాశ్వత విలువ, భౌతిక స్వరూపం, ప్రభుత్వ గుర్తింపు కారణంగా అది ఇప్పటికీ అత్యంత నమ్మదగిన ఆస్తిగా నిలిచింది.

ఇంకా దేశంలో బంగారం ధరలు ప్రాంతానికీ ప్రాంతానికి మధ్య మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో ధరల్లో తేడా ఉంటుంది. ఇది రవాణా ఖర్చులు, వ్యాపార లాభాలు, స్థానిక డిమాండ్ మొదలైన కారణాల వల్ల జరుగుతుంది. ఈ మార్పులకు కూడా, అంతర్జాతీయ బంగారం ధరలు ప్రతి రోజూ ఒక ప్రధాన సూచికగా నిలుస్తాయి.

మొత్తంగా, బంగారం ధరలను ఒకే వ్యక్తి లేదా సంస్థ నిర్ణయించదు. బంగారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతిరూపం. డాలర్ విలువ, వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల విధానాలు, డిమాండ్–సరఫరా నిష్పత్తి, రాజకీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల మనస్తత్వం వంటి అనేక అంశాల సమ్మిళిత ప్రభావం వల్ల బంగారం ధరలు నిర్ణయించబడతాయి. బంగారం కేవలం లోహం కాదు, ప్రజల నమ్మకం, భద్రత, ఆర్థిక స్థిరత్వానికి సంకేతం. దీని నియంత్రణ ఏ ఒక్కరి చేతుల్లోనూ లేదు.

Latest News

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News