దేశ రైల్వే సర్వీసుల్లో ప్రవేశించేందుకు సిద్ధమైన వందే భారత్ స్లీపర్ రైళ్ల నిర్వహణ పరీక్షలను భారత రైల్వే శాఖ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ… 180 కిలోమీటర్ల వేగంతో రైలు సాఫీగా ప్రయాణించిందన్నారు. రాజస్థాన్‌లోని కోటా-లబాన్ స్టేషన్ల మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో వీటిని నడపనున్నారు. ప్రస్తుతం రైలు 130 నుంచి 180 కిలోమీటర్ల వేగం వరకు పరీక్షల్ని పూర్తి చేసింది. మొత్తం 16 బోగీలతో ఉండే ఈ స్లీపర్ రైల్లో థర్డ్, సెకండ్, ఫస్ట్ ఏసీ క్లాసులు, లగేజీ బోగీలు అందుబాటులో ఉండనున్నాయి. మరికొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు సేవలందించనున్నాయి.

