Saturday, August 15, 2026
24.7 C
Hyderabad

బోనమెత్తిన పాలకుర్తి సారలమ్మ

మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి

ఘనంగా ఆలేటి ఎల్లమ్మ జాతర

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు

పాలకుర్తి నియోజకవర్గం లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది జరిగే అలేటి ఎల్లమ్మ జాతర గత 3 రోజులుగా కన్నుల పండువగా జరిగింది. ఈ జాతరకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ జాతరను ప్రజలు తమ కష్టాలు తీర్చే అమ్మవారుగా, కొంగు బంగారం గా ఎల్లమ్మ ను కొలుస్తారు. జాతరలో పాల్గొన్న ప్రజలు ఆలేటి ఎల్లమ్మను మొక్కులు తీర్చుకుంటూ, పూజలు చేశారు. జాతరలో కీలక ఘట్టమైన బోనాలతో ఈ జాతర పూర్తయింది.

జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. డిసిపీ రాజా మహేంద్ర నాయక్, ఎసిపి నర్సయ్య, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్ ల ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరకు భారీ భద్రతను అందించారు. అలాగే, ఆలయ నిర్వహణ కమిటీ కూడా జాతర విజయవంతంగా నిర్వహించేందుకు అహర్నిశలు కృషి చేసింది.

ఈ సందర్భంగా జాతరకు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి ఆలేటి ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆమె ఆలయ అభివృద్ధికి తాను పూర్తిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే ను అమ్మవారి వస్త్రాలతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు వున్నారు. అలాగే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజల విశ్వాసానికి, భక్తి భావనకు ప్రతీకగా నిలిచింది.

Latest News

గిట్ల కూడా బోనం!?|ADUGU TRENDS

జివ్వ కో రుసి, పుర్రె కో బుద్ధి అన్నరు. ఒక్కొక్క లు ఒక్కో తీరన్న మాట! మొన్నీ మద్దెల ఓ పొల్ల, కాల్లకు గిర్రలు కట్టుకొని, గుడికిపోయింది. గది గూడ బోనమెత్తింది. ఇగో గీ...

పార్లమెంటుపై ప్రశ్నలకు బదులేవి!?|EDITORIAL

జెన్‌జీతో పాటు ప్రతి ఓటరు ఇప్పుడు తన ఎంపీ పనితీరును ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు? ప్రజా సమస్యలను ఎన్నిసార్లు లేవనెత్తారు? సభ స్తంభించినప్పుడు వారి...

ఆగస్టు 14, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం తిధి శు.విదియ రాత్రి 08.20 వరకు ఉపరి తదియ నక్షత్రం మఖ ఉదయం 06.50 వరకు ఉపరి పుబ్బ యోగం పరిఘ మధ్యాహ్నం 12.36 వరకు ఉపరి శివ కరణం బాలవ ఉదయం...

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు. మతాల పుట్టుకకు కారణాలు వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు,...

నెత్తింటికెలా? నేతెంటికేలా!?|ADUGU TRENDS

కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం...

డిలిమిటేషన్ – ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|EDITORIAL

2026 ఏప్రిల్‌ 16న లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెట్టబడింది. అధికారిక పార్లమెంటరీ రికార్డు ప్రకారం అది పెండింగ్‌లో ఉంది. ఇంత ప్రాధాన్యమైన రాజ్యాంగ సవరణను తగిన చర్చ లేకుండా ఆమోదించడమూ తప్పే. రాజకీయ...

ఆగస్టు 13, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం శ్రావణ మాసారంభం తిధి శు.పాడ్యమి రాత్రి 09.43 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.42 వరకు ఉపరి మఖ యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.53 వరకు పరిఘ కరణం కింస్తుఘ్నం ఉదయం...

గీ అవ్వ.. భలే బాద్దరిది!?|ADUGU TRENDS

గీ అవ్వ అందరసొంటి మామూలు అవ్వ కాదు. భలే బాద్దరిది. పేరుకే ముసలిది కనీ, వయసొళ్ళు కూడా సేయలేని పనులు శేసి సూపిత్తా0ది. ఏకంగా వింగ్ వాక్ శేసి అందరి మనసులను గెలిసి0ది....

పార్లమెంటులో చివరకు మిగిలేదేంటి?!|EDITORIAL

ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నది నిజంగా ప్రజల కోసమే అయితే, వారికి ప్రయోజనం కలగాలి. విద్యార్థుల కోసమే అయితే వారి సమస్యకు పరిష్కారం రావాలి. ప్రజాస్వామ్యం కోసమే అయితే పార్లమెంట్‌ సరిగా పనిచేయాలి. ప్రజల...

ఆగస్టు 12, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య రాత్రి 11.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుష్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యతీపాత సాయంత్రం 05.28 వరకు ఉపరి వరీయాన్ కరణం చతుస్పాద మధ్యాహ్నం 12.31 వరకు ఉపరి...

జెరం గోలీలు బట్టలకేత్తండ్లు!?|ADUGU TRENDS

బట్టలు సర్ఫు, సబ్బుతోటి ఉతుకుతం. గా బట్టలుతికే మిషినిలైతే లిక్విడ్ పొత్తం. జెరం వత్తే, ఓ పారాసిటమాల్ గోలేత్తం. గీ జెరానికేసే గోలి గా బట్టలకెత్తే!? గా జెరం పోయినట్లే గా మురికి...

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు?|EDITORIAL

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు? మరెక్కడైనా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని అమ్ముకునే వ్యక్తి కేవలం విద్యార్థులను మోసం చేయడం లేదు. మెరిట్‌, కష్టం, ప్రతిభపై ఉన్న...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News