పండుగలొత్తే గ దుకాణదారులు, కంపెనీలోల్లు ఆపర్లు పెట్టడం శూసినం. కనీ, ఏకంగా పభుత్వమే పజలకు బంపబరాఫర్ ఇచ్చుడు ఎక్కడైన సూసినమా? ఇగో గా సర్కార్ ఏం శేసిందో సూడుండ్రి.

ఇగ దీపాలి రానే వచ్చే. ధరలేమో మండిపోబట్టె. ఇగ గీ తకరారుకు తాత్కాలిక ఉపశమనానికి గా తమిళనాడు సర్కార్ మస్తు ఆలోశెన శేసింది. ‘వెట్రి కూరగాయల కిట్’ పేరన వంద రూపాలకే 10 రకాల కాయగూరలను అందిత్తాంది. 218 సహకార దుకాన్లల్ల, చెన్నైల ఉన్న నాలుగు సంచార దుకాణాలల్ల గీ నెల 5 తో తారీకు నుండి ఏడో తారీకు దాకా అమ్ముతరట. ఇగ గా కిట్ల మొత్తం రెండున్నర కిలోల మీద మరో వంద గ్రాముల కూరగాయలుంటయి. ఇగ గా10 రకాలల్ల అర కిల ఉల్లిగడ్డ, అర కిల టమాటలు, పావు కిల వంకాయెలు, పావు కిల ఆలుగడ్డలు, 200 గ్రాముల క్యారెట్లు, 200 గ్రాముల బీన్లు, 100 గ్రాముల పచ్చి మిరపకాయెలు, 100 గ్రాముల నిమ్మకాయెలు, 50 గ్రాముల అల్లం, ఓ మొతాదుల కొబ్బరికాయ అసొంటియి ఉంటయి. ఇగ గయన్ని తాజాగా ఉండాల్నని గా అధికారులకు గా తమిళనాడు సర్కార్ హుకుం జారీ శేసింది. ఎట్లుంది గీ నజరానా? గిట్లనే మనకు కూడా మన సర్కారిత్తే బాగుండనిపిత్తాంది కదా?

