తిరుపతి ఆలయ లడ్డూ ప్రసాదానికి సంబంధించిన కల్తీ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు బృందం నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో భోలే బాబా డెయిరీ (ఉత్తరాఖండ్) మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ (పూనంబాక్కం) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డెయిరీ (దుండిగల్) ఎండీ రాజు రాజశేఖరన్ ఉన్నారు. నకిలీ పత్రాలు, సీల్స్‌తో టెండర్లు దక్కించుకుని నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వైష్ణవి డెయిరీ రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. క్రైం నెం.470/24 కింద నిందితులను అరెస్టు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచారు.

