మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు
ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు
అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు!
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మట్టి వినాయకుల పంపిణీ చేయడమే గాక, వివిధ కార్యక్రమాలు చేపడుతున్న అడుగు డిజిటల్ మీడియా బృందాలపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అడుగు ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించాలని అడుగు కార్యాలయానికి ఫోన్లు చేసి అభినందిస్తున్నారు.
అలాగే, మట్టి విగ్రహాలను ప్రతిష్టించిన ఉత్సవ కమిటీల అధ్యక్షులను సత్కరించి ప్రోత్సహిస్తూ, డిజిటల్, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా మార్గం లక్ష్మీ నారాయణకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోన్ ద్వారా, అలాగే ఈడీ మార్గం సాయి సందేశ్ తేజను జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ప్రత్యేకంగా గురువారం ఫోన్‌లో అభినందించారు. అలాగే ఈ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న డా. మార్గంకు కూడా అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ లు వేముల వీరేశం, జాటోతు రామచంద్రనాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీలు తాత మధు, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, యశస్విని రెడ్డి, మందుల సామేలు, మదన్ మోహన్ రావు, పాల్వాయి హరీష్ బాబు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్ శివసేనారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీలు డా.జీ రంజిత్ రెడ్డి, పి. రాములు, రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, బాల్క సుమన్, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, మెతుకు ఆనంద్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్, జిల్లా నాయకులు పల్లా సుందర్ రామ్ రెడ్డి, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి తదితరులు కూడా అభినందించిన వారిలో ఉన్నారు.

