యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి.
తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన రామ్మూర్తి.. పెండ్లాం సుందరి, కొడుకులు ప్రకాశ్, ప్రభులతో కలిసి కొయంబత్తూరుకు పోయిండు. గాడ 2023ల 16 ఏండ్లప్పుడు ప్రకాశ్ తప్పిపోయిండు. యెతికి యెతికి యేసారి, పోలీసు టేసన్ల ఫిర్యాదు శేసిండ్రు.
గాడ కట్ సేత్తే.. పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దుల బానిసగ పని శేత్తున్న ప్రకాశ్ ను 2022ల అప్నా బర్స్ సేవా సంస్థ రచ్చించింది. పటియాల జిల్ల లక్కానిల ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు అప్పగించింది. తల్లి, ఊరు పేరు తప్ప మరేమీ గుర్తులేదని ప్రకాశ్అనడంతో ఎవలికి అప్పగించాలో తెలియక తికమకపడ్డరు.

మల్లా గాడ కట్ సేత్తే, గా లక్కాని సంస్థ దగ్గరకు చండీఘడ్ ల ఉంటున్న తమిళనాడుకు శెందిన సుభాశ్ సూద్దామని పోయిండు. గాడ గీ ప్రకాశ్ సంగతి యిన్నడు. గాయినె శెప్పిన పకారం తిప్పూరులోని గాయినె దోస్తు ముత్తయ్యకు గీ ముచ్చట శెప్పిండు. ఇగ ఇద్దరు కలిసి మూడేండ్లు ఎతికిండ్రు. గా పోలీసు స్టేషన్ల ఇచ్చిన తప్పిపోయిన దరఖాస్తును బట్టి, గా ప్రకాశ్ తల్లి అడ్రసు దొరకబట్టిండ్రు. గా ముచ్చటను గా సుందరికి శెప్పిండ్రు. గంతే గామె తన కొడుకు దగ్గెరికి పోయింది. గుర్తు పట్టింది. కొన్ని సుబూత్ లు సూపింది. కొడుకును ఇంటికి తెచ్చుకుంది. ఇగ గిండ్ల మరో యిషాదమేంటంటే, గా ప్రకాశ్ తండ్రి రామ్మూర్తి పాపం క్యాన్సర్ తో సచ్చిపోయిండు. యిధి ఎంత యిసిత్రమైందో సూసిండ్రా?

