Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్
తెలంగాణ నేతల బహిష్కరణ
రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యాంసుందర్ ఆరోపించారు. రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లో శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేయగా, జరిగిన సభ ఆశించిన స్థాయిలో సాగకపోగా, అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు. కేవలం ఆంధ్ర నాయకులకే పరిమితమైన ఈ సభకు తెలంగాణ నేతలెవరూ హాజరు కాలేదని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

అమరవాది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో బహిష్కరించడం ద్వారా అమరవాది వర్గానికి గట్టి బుద్ధి చెప్పారని శ్యామ్ విమర్శించారు. ముఖ్యంగా వైశ్య పితామహుడు గంజి రాజమౌళి గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత, వంటి హేమాహేమీలతో పాటు వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్ గుప్త, బొల్లం సంపత్ వంటి వారు అమరవాది ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదన్నారు. ప్రోటోకాల్ ఉన్న నాయకులు సైతం ఈ ‘అక్రమ ఎన్నిక’ను నిరసిస్తూ దూరంగా ఉండటం, అమరవాది వర్గం పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

గత 11 ఏళ్లుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అమరవాది వర్గానికి తెలంగాణ వైశ్య సమాజం ఈ విధంగా చెంపదెబ్బ కొట్టిందని శ్యాంసుందర్ మండిపడ్డారు. నిన్నటి వరకు ఆంధ్ర నేతలను విమర్శించిన వారే, నేడు టీజీ వెంకటేష్, కనకరాజు వంటి ఆంధ్ర నాయకుల అండ కోసం పాకులాడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గతంలో శ్రీశైలం సత్రం విషయంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిన అమరవాది, ఇప్పుడు తన పదవి కోసం ఆంధ్ర నేతలను ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం 2-3 ఓట్ల సాంకేతిక మెజారిటీతో, అంగబలం, అర్థబలంతో గెలిచినంత మాత్రాన అది నిజమైన విజయం కాదని, తనకు వచ్చిన 520 ఓట్లు నీతినిజాయితీకి ప్రతీకలని ఆయన స్పష్టం చేశారు.

కేవలం కొద్దిమంది రైస్ మిల్లర్ల నాయకులతో తూతూమంత్రంగా సభ జరుపుకోవడం హాస్యాస్పదమని, ఈ అక్రమ పదవి శాశ్వతం కాదని ఆయన హెచ్చరించారు. వైశ్య మహాసభలో జరిగిన అక్రమాలు, అన్యాయంపై త్వరలోనే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని, తప్పు చేసిన వారికి కోర్టు ద్వారా బుద్ధి చెబుతామని శ్యాంసుందర్ హెచ్చరించారు. పదవుల కోసం, వ్యాపారాల కోసం కొందరు బానిసలుగా మారవచ్చు కానీ, ఆత్మాభిమానం ఉన్న ఆర్యవైశ్య జాతి అన్యాయాన్ని ఎప్పుడూ సహించదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పేరుతో ఆంధ్రా నేతలతో సభ నిర్వహించి అమరవాది వర్గం ఏకాకిగా మిగిలిపోయిందని, భవిష్యత్తులో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News