Wednesday, September 16, 2026
27.1 C
Hyderabad

Women|మహిళ, Child Protection|బాలల సంరక్షణ మా బాధ్యత

Child Friendly court| చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రవేశ పెట్టిన ఘనత మా Government| ప్రభుత్వానిదే.

-సీఎం రేవంత్ రెడ్డి|CM REVANTH REDDY

VOICE FOR THE VOICELESS| వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన STATE LEVEL| రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, తమ బాధను వెలికితీయలేని బాలల కోసం ఇలాంటి చర్చా వేదికలు ఈ కాలంలో అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, శారీరక మరియు మానసిక హింసలను అరికట్టేందుకు సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ పోలీసు శాఖను, ఇతర నిర్వాహకులను సీఎం అభినందించారు.

బాలల రక్షణకు తన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి, బాలికల సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన భరోసా ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇవి పోలీస్ సహాయంతో పాటు న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సెలింగ్ వంటి బహుముఖ సేవలను అందిస్తున్నాయని వివరించారు. హైదరాబాద్‌లోని భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు.

పోక్సో చట్టం, జ్యువెనైల్ చట్టాలు మనం సాధించిన ప్రగతిని సూచించే గొప్ప పద్ధతులుగా ఉన్నాయని వ్యాఖ్యానించిన సీఎం, కానీ వాటి అమలులో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. బాధితుల భవిష్యత్తుకు ప్రమాదం కలగకుండా, చట్టాలు సంపూర్ణ రక్షణగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నేరాల నియంత్రణకే కాదు, బాధితుల భద్రతకు, పునరావాసానికి సమగ్రమైన చర్యలు అవసరమని స్పష్టంచేశారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా పిల్లలపై జరుగుతున్న దురాగతాలను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి, ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. దోషులకు ఎలాంటి రాయితీ ఇవ్వకుండా, కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన విధానాలను సిద్ధం చేయడంలో ముందుండుతుందని పేర్కొన్నారు.

న్యాయం అంటే కేవలం కోర్టుల వరకే పరిమితం కాకూడదని, ప్రతి దశలోనూ, ప్రతి స్థాయిలోనూ పిల్లలకు న్యాయం లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. పోలీస్ స్టేషన్లు, బాలల సంక్షేమ కేంద్రాలు కలిసి పని చేస్తేనే న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని అన్నారు.

చివరగా గౌరవ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలల సంక్షేమ కమిటీలు, అభివృద్ధి భాగస్వామ్య సంస్థలందరినీ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయం అంటే శిక్షలు విధించడమే కాదు… బాధితుడి జీవితానికి భరోసా కల్పించడమే అసలైన న్యాయం అని స్పష్టం చేసిన సీఎం, పిల్లలు తమ బాల్యాన్ని తిరిగి పొందేలా ప్రతి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Latest News

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News