Thursday, September 24, 2026
22.5 C
Hyderabad

భారతీయ జీవన, విద్యావిధానమే జీవనాడి!|EDITORIAL

భారతీయ జీవన, విద్యావిధానం ఒకప్పుడు మనిషి మేధస్సుకు పదును పెట్టి, ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్లేలా ఉండేది. అన్ని రంగాల్లో విద్యార్థులను ఆరితేరేలా చేసే సమగ్ర విద్యా విధానం మనదే! కానీ, కాలక్రమేణా ఆ వ్యవస్థను మనమే కాల గర్భంలో కలిపేస్తున్నాం. బ్రిటిష్ పాలనలో మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానం భారతీయ విద్యా తత్వాన్ని దెబ్బతీసింది. ఫలితంగా నైపుణ్యాలు, విలువలు లేని విద్యార్థులు పెద్ద సంఖ్యలో తయారవుతున్నారు. చదువున్నా ఉపాధి లేదు. డిగ్రీలున్నా దిశా దెశా లేదు. ఇదే నేటి దుర్భర వాస్తవం.

దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అవకాశాలు విస్తారంగా ఉన్నప్పటికీ బీటెక్, ఎంటెక్ వంటి డిగ్రీలు చదివిన యువత ఆ రంగాల వైపు అడుగులు వేయలేకపోతున్నారు. చదువు వేరు, వృత్తి వేరు అన్న దృక్పథం యువతలో బలంగా పాతుకుపోయింది. భారతీయ మేధస్సు అపారమని ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం, సైన్స్ రంగాల్లో మనవాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ అలాంటి మానవ వనరులను దేశంలోనే అభివృద్ధి చేసుకునేలా విద్యావిధానం రూపుదిద్దుకోలేదు.

సమాజంలో విలువలు పడిపోవడం, యువతలో నైపుణ్యాల కొరత మన విద్యావిధాన లోపాలే. అత్యాధునిక సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థుల మేధస్సుపై తీవ్రంగా పడుతోంది. ప్రతి చిన్న విషయానికీ గూగుల్‌ను ఆశ్రయించడం అలవాటైంది. గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోయి చదువుకూ, ఆలోచనకూ దూరమవుతున్నారు. యువతలో పోర్న్ వ్యసనం, ఆన్‌లైన్ జూదాలు, మానసిక ఒత్తిడి పెరిగి చివరికి ఆత్మహత్యల వరకూ వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వ్యక్తిగత సమస్య కాదు. ఇది ఒక సామాజిక రుగ్మతగా మారింది.

ఈ పరిస్థితిని మార్చాలంటే అక్షరాభ్యాసం నుంచే క్రమశిక్షణను అలవర్చాలి. విద్యారంగాన్ని బలోపేతం చేసి విలువలతో కూడిన విద్యను అందించాలి. లేకపోతే సమాజం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది. నేటి తల్లిదండ్రులు చిన్న పిల్లలను బుజ్జగించడానికి, అన్నం పెట్టడానికి కూడా సెల్‌ఫోన్‌ను చేతికిస్తున్నారు. ఫలితంగా పిల్లల్లో మానసిక పరిపక్వత తగ్గి, తరగతి గదుల్లో పరధ్యానంగా మారుతున్నారు. ఆటస్థలాల్లో చురుకుదనం తగ్గి, ఒంటరితనం పెరుగుతోంది.

పాఠశాలల్లో కూడా బోధన యాంత్రికంగా మారింది. స్క్రీన్ల ద్వారా పాఠాలు చెప్పడం పెరిగిపోయింది. పిల్లలు టీచర్లతో సంభాషించడం మానేసి, పరస్పర అవగాహన కోల్పోతున్నారు. పుస్తక పఠనం తగ్గింది. పరిసరాలపై అవగాహన లేకుండా, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా చదువులు పూర్తిచేసి పట్టాలు పుచ్చుకుంటున్నారు. మనం తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుందో, పాలు ఎలా వస్తాయో కూడా తెలియని తరం తయారవుతోంది.

సెల్‌ఫోన్ వ్యసనానికి తోడు జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతోంది. టీనేజర్లలో ఆత్మహత్యా ప్రయత్నాలు పెరిగాయి. అధ్యయనాల ప్రకారం ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లూ లైట్ ప్రభావం, నిద్రలేమి, ఆటలు ఆడకపోవడం మనమే తెచ్చుకున్న సమస్యలు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ విద్య పిల్లలను మరింతగా ఫోన్లకు బానిసల్ని చేసింది. ఇప్పుడు కోవిడ్ లేకపోయినా ఆ అలవాటు మాత్రం కొనసాగుతోంది.

టెక్నాలజీ అవసరం కాదనలేం. కానీ, దానికీ ఓ పరిమితి ఉండాలి. అదే జీవితం కాకూడదు. చిన్నప్పటి నుంచే పిల్లలను టెక్నాలజీకి అతుక్కుపోయేలా చేయడం వారిని బడి, కుటుంబం, చివరకు స్వతంత్ర ఆలోచనల నుంచే దూరం చేస్తోంది. పిల్లల్లో మానసిక పరివర్తన, పరిపక్వత రావాలంటే సమతుల ఆహారం, వ్యాయామం, నడక, ఆటలు తప్పనిసరి. మన ప్రాచీన జీవన విధానాల్లో ఉన్న సౌలభ్యం, సమతుల్యతను మళ్లీ మనం పాటించాలి.

ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా విద్యను చూడాలి. పాఠశాలల్లో పెరుగుతున్న వ్యాపార ధోరణిని అడ్డుకోవాలి. కానీ అంతకన్నా ముందు తల్లిదండ్రులే మారాలి. ఈ బిజీ జీవితంలో పిల్లల కోసం సమయం కేటాయించాలి. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. లేదంటే మన పిల్లల భవిష్యత్తే కాదు, మన సమాజపు పునాది కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులూ… తస్మాత్ జాగ్రత్త! ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే, రేపు పశ్చాత్తాపంతో కూడా పని ఉండదు.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News