వచ్చే 3,4 సంవత్సరాలలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, కొన్ని రాజకీయ పార్టీలు ఉత్తరంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, దక్షిణంలో సీట్లు తగ్గిపోతాయని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణంలో జనాభా తక్కువగా ఉన్నందున కుటుంబ ప్రణాళిక చర్యల కారణంగా పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయని కూడా చెబుతున్నారని, ఇవన్నీ పూర్తిగా అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు అని దుయ్యబట్టారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు అందరూ తప్పుడు సమాచారం చెప్తున్నారన్నారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన పూర్వం చేసిన విధంగానే చేయబడుతుందన్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు తగ్గిపోవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి చెప్పారని కిషన్ రెడ్డి చెప్పారు.

