Monday, August 3, 2026
31.5 C
Hyderabad

సినిమా సమీక్ష: “విడుదల 2”

దర్శకుడు: వెట్రి మారన్
నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కన్నడ కిషోర్, తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్ వెల్ రాజ్
ఎడిటింగ్: ఆర్ రామర్
సంగీతం: ఇళయరాజా
నిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్, రామారావు చింతపల్లి
బ్యానర్: ఆర్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ, శ్రీ వేధాక్షర మూవీస్
రిలీజ్ తేదీ: 2024 డిసెంబర్ 20

రివ్యూ :

“విడుదల 2” ఒక క్రూరమైన సమాజంలో మార్పు సాధించడానికి తపనపడే వామపక్ష ఆలోచనలతో కూడిన కథను చెప్పే చిత్రం. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన పెరుమాళ్ (విజయ్ సేతుపతి), సమాజంలో అసమానతలను నిర్మూలించేందుకు పోరాడే నాయకుడు. పోలీసులు అతన్ని అక్రమంగా అదుపులోకి తీసుకుని తీవ్ర శారీరక హింసకు గురి చేస్తారు, కానీ పెరుమాళ్ తన నిర్బంధం నుండి తప్పించుకుంటాడు. ఆయన జీవితంలో వచ్చే ప్రధాన అనుమానాలు, వివాహ జీవితం, నక్సలైట్ ఉద్యమంలో చేరడంలో తగిన ప్రభావం, మరియు రైలు ప్రమాదం వెనుక ఉన్న వాస్తవం ఈ సినిమాకి కీలకాంశాలు.

ఈ చిత్ర కథ “విడుదల 1″లో విజయ్ సేతుపతి అరెస్టుతో ముగిసింది. “విడుదల 2” లో, ఆ కథ కొనసాగుతూ భావోద్వేగపూరిత సన్నివేశాలతో మొదలై, ఒక్కసారి పెరుమాళ్ జీవితం మీద క్లారిటీ వచ్చిన తర్వాత కథలో వేగం తగ్గుతుంది. మొదటి భాగంలో కొన్ని భావోద్వేగానికి కారణమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, రెండో భాగంలో యాక్షన్‌కు సంబంధించిన కీలక అంశాలు ముందుకు వస్తాయి. ఇందులో ఎన్‌కౌంటర్ల, ప్రజా దళం ఉద్యమం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

నటీనటులు:

విజయ్ సేతుపతి తన పాత్ర పెరుమాళ్‌లో అద్భుతమైన ప్రదర్శన చూపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ , గెటప్, భావోద్వేగం ప్రతి సన్నివేశంలో పెరుమాళ్ పాత్రను మరింత సజీవం చేసింది. ఆయన నటన ఈ సినిమాలో బలంగా నిలిచింది. మంజు వారియర్ కూడా తన పాత్రలో హుందాగా పర్ఫెక్ట్‌గా నటించారు. ఆమె గ్లామర్‌తో కూడిన పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కోసం అదనంగా ఆకట్టుకుంది. కన్నడ కిషోర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూరి వంటి ఇతర నటులు తమ పాత్రల మేర నటించారు.

సాంకేతిక అంశాలు:

ఇళయరాజా మ్యూజిక్, ప్రత్యేకంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరింత ఉత్కంఠను రేపింది. రామారావు చింతపల్లి, ఎల్ రెడ్ కుమార్ నిర్మాణం బాగుంది. ఆర్ వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా సాగింది, ముఖ్యంగా ఫారెస్ట్ సన్నివేశాలు మరియు యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ ఆకట్టుకొంటాయి.

దర్శకత్వం & స్క్రీన్ ప్లే:

వెట్రి మారన్ దృష్టి, కథనం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, మొదటి సగం కొంత లాగ్ అయ్యింది. అయితే, రెండో సగంలో యాక్షన్ సన్నివేశాలు, ఎన్‌కౌంటర్లు, క్లైమాక్స్ విషయంలో అతని టేకింగ్ మిక్కి హైప్ క్రియేట్ చేసింది. ఆయన ధైర్యంగా సామాజిక అంశాలను స్పురిస్తూ, చిత్రాన్ని చక్కగా డీల్ చేశారు.

ప్రేక్షకుడి అంచనా :

“విడుదల 2” ఒక అద్భుతమైన ఎమోషనల్, యాక్షన్ డ్రామా. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ రాసిన , డైలాగ్ లైన్లు, మొదటి సన్నివేశం, క్లైమాక్స్ సినిమాకు మరింత హైలైట్ చేశాయి. మొదటి అర్ధంలో కొంత లాగ్ ఉన్నప్పటికీ, రెండో అర్ధం ఎమోషనల్, యాక్షన్ అంశాలతో ప్రాణం పొంది, క్లైమాక్స్‌ అదిరిపోయింది. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్, వామపక్ష భావజాలంతో సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుంది.

రేటింగ్: 3.75/5

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News