ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ సామాజిక వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోగా, తిరిగి అదే విధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


