Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

గురువును మి(ము)oచిన శిష్యుడు!

చోటా చర్యలపై ఇంటిలిజెన్స్ ఆరా!

సిఎం రేవంత్ కు ఫిర్యాదు చేసిన బడా లీడర్

శిష్యుడి సెటిల్మెంట్ల తో కొండా దంపతులకు ఇబ్బందులు

ఎక్కడైనా శిష్యులు గురువును చూసి తాము ఉన్నత స్థాయికి చేరడానికి ప్రయత్నిస్తారు. గురువు చూపినబాటలో పయనించి ఉన్నతి సాధిస్తారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రం గురువును మి(ము)oచిన శిష్యుడుగా పేరు సంపాదించాడు ఓ ప్రబుద్ధుడు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్ రావు శిష్యుడిగా ముద్రపడ్డ ఓ షాడో నీడ కొండా దంపతులకు సంకటంగా మారింది. గురువును మించిన శిష్యుడిగా కాకుండా గురువును ముంచిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవి చేపట్టిన సురేఖకు ఇప్పుడు శిష్యుడి రూపంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ‘సార్’ చెప్పాడంటూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్న సదరు ప్రబుద్ధుడు చేసే పనుల వల్ల కొండా దంపతులకు రాష్ట్ర వ్యాప్తంగా చెడ్డ పేరు వస్తోంది. ఒక వైపు కేటీఆర్ పై విమర్శల వివాదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మంత్రి సురేఖకు శిష్య పరమాణువు చేస్తున్న చేష్టలు తలనొప్పిగా మారాయి. తన పుట్టినరోజు వేడుకలు అంటూ రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేసిన చోటా లీడర్ కటౌట్లు, ఫ్లెక్సీలు బ్యానర్లతో మూడు రోజుల పాటు చేసిన హంగామా కొండా దంపతుల కొంప ముంచనుంది. సదరు శిష్యుడికి ఇంత డబ్బు ఎక్కడిది? అసలు ఆ శిష్యుడు చేసే పని ఏంటి? అనే విషయంపై ఇంటిలిజెన్స్ విభాగాలు ఇప్పటికే ఆరా తీయడం మొదలు పెట్టాయి. జిల్లాకు చెందినట్లు సమాచారం. ఆ వివరాలు అన్నీ కలిపి ఓ గ్రంథమే అయిందని తెలిసింది. హనుమకొండ ప్రాంతానికి చెందిన ఆ బడా నేత.. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉంది. ఆయన కొండా శిష్య ప్రబుద్ధుడు పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అక్రమంగా సంపాదించిన డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ఆ శిష్య పరమాణువు పుట్టినరోజు వేళ భారీ కాన్వాయ్ తో భద్రకాళి దేవాలయం వరకు ఎలా వెళ్లాడు? పోలీసులు ఎలా అనుమతిచ్చారు? ప్రోటోకాల్ లేని ఆ వ్యక్తికి ఆలయంలో ఎలా మర్యాదలు దక్కాయి? భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కటౌట్ లు కడితే కార్పొరేషన్ అధికారులు చూస్తూ ఊరకున్నారు? ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర ఏంటి? వంటి పలు కోణాల్లో ముఖ్యమంత్రికి ఇప్పటికే నివేదికలు అందినట్లు సమాచారం. కొండా దంపతులకు కొరకరాని కొయ్యగా మారిన చోటా లీడర్ తతంగం ఏ పరిస్థితికి దారితీస్తుందో!? అని కాంగ్రెస్ సీనియర్లు, కొండా అనుచరులు వేచి చూస్తున్నారు.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News