Friday, September 4, 2026
26.2 C
Hyderabad

‘పాల’కూట విషం!|EDITORIAL

మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% భారత్ లోనే జరుగుతున్నది. దేశంలో 91వేల కోట్ల లీటర్ల పాలు అవసరముండగా, 23వేల 930 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. తేడా 67 వేల కోట్లకు పైగా లీటర్లు. గత పదేళ్ళల్లో పాల ఉత్పత్తి కేవలం 6% పెరగగా, వినియోగం మాత్రం 64% పెరిగింది. ఉత్పత్తి,వినియోగాల మధ్య ఈ భారీ తేడానే పాల కల్తీకి కారణమవుతోంది. ప్రజావసరాలను సొమ్ముచేసుకునే నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ పాలే ప్రజల పాలిట కాలకూట విషంగా మారుతున్నాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పాలను స్వచ్ఛతకు, పోషకానికి ప్రతీకగా చూస్తాం. ప్రతి ఇంటి రోజువారీ ఆహారంలో పాలు ప్రాథమిక ఆవశ్యం. అనివార్యం. మరి పాలే కల్తీకి గురై ప్రాణాంతకమవుతుంటే ప్రజలకు దిక్కేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించడం, మరికొందరు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్స్ లో చికిత్స పొందడం రాష్ట్రాన్ని కలవరపరుస్తోంది. ఒకే చోట పాలు కొనుగోలు చేసిన వారిలో అనూరియా లక్షణాలు అంటే మూత్రం ఆగిపోవడం, బయటపడటం, అర్థాంతరంగా కిడ్నీలు ఫెయిల్ కావడంతో కొందరికి డయాలసిస్ అవసరం కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

పాలే ప్రజల పాలిట కాలకూట విషమవడం అత్యంత దారుణం.ప్రాథమిక విచారణలో ప్రైవేట్ డెయిరీ నుంచి సరఫరా అయిన పాలే అస్వస్థతకు కారణమని తేలింది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బాధితుల వైద్య ఖర్చులను భరించనున్నట్టు హామీ ఇచ్చింది.

మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% భారత్ లోనే జరుగుతున్నది. దేశంలో 91వేల కోట్ల లీటర్ల పాలు అవసరముండగా, 23వేల 930 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. తేడా 67 వేల కోట్లకు పైగా లీటర్లు. గత పదేళ్ళల్లో పాల ఉత్పత్తి కేవలం 6% పెరగగా, వినియోగం మాత్రం 64% పెరిగింది. ఉత్పత్తి,వినియోగాల మధ్య ఈ భారీ తేడానే పాల కల్తీకి కారణమవుతోంది. ప్రజావసరాలను సొమ్ముచేసుకునే నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ పాలే ప్రజల పాలిట కాలకూట విషంగా మారుతున్నాయి. కాగా, పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ (16.21%), రాజస్థాన్ (14.51%), మధ్యప్రదేశ్ (8.91%), గుజరాత్ (7.65%), మహారాష్ట్ర (6.71%) అగ్రస్థానంలో ఉన్నాయి.

పాల కల్తీ కొత్తేమీ కాదు. ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలపడం పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు యూరియా, ఫార్మలిన్, గ్లూకోజ్, సోడా, సింథటిక్ పదార్థాలు, గంజి పొడి లాంటి ప్రాణాంతక ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. ఇక రెండు లీటర్ల పాలను అయిదారు లీటర్లుగా మార్చే దందా వెలుగులోకి వస్తోంది. నిల్వ కోసం వాడే ఫార్మలిన్ తో జీర్ణకోశం దెబ్బతింటుంది. చిక్కదనం కోసం యూరియా కలపడం మూత్రపిండాలకు ముప్పు. ఇలాంటి కల్తీ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే కాక, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు పరిస్థితి దిగజారుతుంది.

ఈ దురవస్థకి కారణాలు అనేకం. రాష్ట్రంలో పాల ఉత్పత్తి–వినియోగం మధ్య భారీ తేడా ఉంది. అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేక కొందరు అక్రమాలకు దిగుతున్నారు. ప్రైవేట్ డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, వాటిపై నియంత్రణ, నిఘా పర్యవేక్షణ లేకపోవడం సమస్యను మరింత తీవ్రచేస్తోంది. సహకార రంగం బలహీనపడటంతో డెయిరీల మధ్య అనారోగ్య పోటీ నెలకొంది. లాభాల కోసం అడ్డదారులు తొక్కే దరిద్రం దాపురించింది.

ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ నిర్వీర్యమైంది. సమర్థవంతమైన పరీక్షా ప్రయోగశాలలు ఉన్నాయా? పాల నమూనాలను తరచుగా తనిఖీ చేస్తున్నారా? లైసెన్స్ లేని డెయిరీలు ఎందుకు నడుస్తున్నాయి? తనిఖీ బాధ్యతను ఆయా శాఖలకు వదిలేయడం సరైన విధానం కాదు. ప్రజారోగ్యం పరిరక్షణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత.

పాడి పంట గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకం. కష్టపడి పాలను ఉత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోవడం మరో సమస్య. రైతు వద్ద తక్కువ ధరకు సేకరించిన పాలను మధ్యవర్తులు అధిక లాభాలతో విక్రయిస్తున్నారు. ఉత్పత్తి స్థాయిలో పారదర్శకత లేకపోవడం, సరఫరాలో పర్యవేక్షణ లోపాలు కల్తీకి కారణమవుతున్నాయి. పాడిపశువుల సంఖ్య, ఉత్పత్తి పరిమాణం, సరఫరాలపై సమగ్ర సమాచారం, లెక్కలు లేకపోవడం కూడా లోపమే.

తనిఖీలు నిర్వహించి లైసెన్స్ లేని కేంద్రాలను మూసివేయాలి. పాల ఉత్పత్తి నుంచి వినియోగదారు వరకు సరఫరాలపై పూర్తి అవగాహన, పాదర్శకతతో కూడిన వ్యవస్థను అమలు చేయాలి. ఆధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, తరచూ తనిఖీ పరీక్షలు నిర్వహించాలి. కల్తీ పాల తయారీని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధించాలి. సహకార డెయిరీలను బలోపేతం చేసి రైతు ఆధారిత పారదర్శక వ్యవస్థను పునరుద్ధరించాలి.

అలాగే పాలు-కల్తీపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇంటి వద్దే సాధ్యమయ్యే ప్రాథమిక పరీక్షలపై చైతన్యం చేయాలి. అనుమానాస్పద, కల్తీ పాలపై వెంటనే ఫిర్యాదు చేసే హెల్ప్ లైన్‌లు అందుబాటులో ఉండాలి. అధిక పాల ఉత్పత్తికి పశువులకు ఇచ్చే ఆక్సిటోసిన్ వంటి నిషేధిత ఇంజెక్షన్ల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలి.

పాలు ఒక్క రాజమండ్రిలో మాత్రమే కాదు. అంతటా కల్తీ అవుతున్నాయి. కాకపోతే, రాజమండ్రి ఘటన వెలుగులోకి వచ్చిన ఒక హెచ్చరిక. నమ్మకమైన పాలను సరఫరా చేయడం ప్రభుత్వ బాధత. సమాజ హితం. లాభాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టే పాల కల్తీగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలి.

Latest News

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

గీ కర్ణాటక ట్రాఫిక్ కట్టాలకు గింత కథ ఉందా!?|ADUGU TRENDS

ట్రాఫిక్ కట్టాలు లేందెక్కడ? కిరాణా దుకాన్ల, రేషన్ షాపుల్ల, బ్యాంకుల్ల, బస్సుల్ల, రోడ్ల మీద, శివరాకరికి సులభ్ కాంప్లెక్సుల్ల కూడా రద్దేనాయె!? కానీ, గీ కర్ణాటకల రద్దీకి కర్ణునికి ఏదో లింకుందట సూద్దాం...

ఉగ్రమూలాలపై పాక్ కు భారత్ మరో హెచ్చరిక!?|EDITORIAL

పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకుంటే మాటలకంటే చర్యలు ముఖ్యం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలు పారదర్శకంగా, నిరంతరంగా ఉండాలి. ఉగ్రవాదాన్ని ఒకప్పుడు వ్యూహాత్మక సాధనంగా చూసిన విధానాలకు స్వస్తి చెప్పి, పొరుగుదేశాలతో విశ్వాసాన్ని...

సెప్టెంబర్ 03, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 01.39 వరకు ఉపరి సప్తమి నక్షత్రం కృత్తిక రాత్రి 12.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యాఘాత రాత్రి 07.56 వరకు ఉపరి హర్షణ కరణం భద్ర పగలు 02.43 వరకు ఉపరి బవ రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News