Tuesday, September 15, 2026
25.7 C
Hyderabad

నిరుపయుక్తంగా యాప్ ఆధారిత యూరియా సరఫరా!|EDITORIAL

సాంకేతికత ఒక సాధనం మాత్రమే. అది రైతు ప్రయోజనానికి ఉపయుక్తంగా ఉండాలి. యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం సరైన సవరణలతో, మానవీయ దృష్టితో అమలైతే వ్యవసాయ రంగానికి నిజమైన మేలు చేకూరుతుంది. లేదంటే అది రైతుల అసహనానికి, ఆగ్రహానికి, వ్యవసాయంపై నమ్మకం కోల్పోయే పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

వ్యవసాయ రంగంలో పారదర్శకత తీసుకురావడం, ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టడం, నిజమైన రైతుకు సరైన సమయంలో సరైన పరిమాణంలో యూరియా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘యాప్’ ఆధారిత యూరియా సరఫరా విధానాన్ని అమలు చేస్తోంది. సిద్ధాంతపరంగా ఇది ప్రశంసనీయమైన చర్యే. గతంలో యూరియా కొరత, బ్లాక్ మార్కెట్, దళారుల మాయ, పొరుగు రాష్ట్రాలకు అక్రమ రవాణా వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పంట రకం ఆధారంగా యాప్‌లో నమోదు చేసి యూరియా పంపిణీ చేయడం వల్ల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవాలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ లేని, యాప్ వినియోగంపై అవగాహన లేని వృద్ధ రైతులు, నెట్‌వర్క్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. యాప్‌లో పేరు నమోదు అయినప్పటికీ సర్వర్ డౌన్, బయోమెట్రిక్ పని చేయకపోవడం, డేటా తప్పిదాలు వంటి కారణాలతో యూరియా అందక రైతులు రోజులు తరబడి దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా ఈ యాప్ పై సరైన ప్రచారం లేకపోవడంతో, యాప్ విషయం తెలియని రైతులు నేరుగా ఎరువుల దుకాణాలకు వెళ్ళి, వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. యాప్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు. ఎవరిని సంప్రదించాలో అర్థం గాక అయోమయంలో పడుతున్నారు.

వ్యవసాయం కాలపరిమితితో కూడిన వృత్తి. విత్తే సమయానికి యూరియా అందకపోతే పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాంకేతికత రైతుకు సేవ చేయాలి. సాయమందించాలి. కానీ రైతును శిక్షించే ఆయుధంగా మారకూడదు. ఈ కనీస భావన, అవగాహనను పాలకులు, ప్రత్యేకించి విధాన నిర్ణయాల్లో కీలకంగా అమలు చేసే ఉన్నతాధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో రైతాంగం సమస్యలపై అవగాహన లేకపోతేనే ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి.

యాప్ విధానం వల్ల కొంతవరకు దళారుల నియంత్రణ తగ్గింది అన్న వాదన కూడా ఉంది. కానీ అదే సమయంలో వ్యవసాయ సహకార సంఘాల వద్ద పని భారం పెరగడం, సిబ్బంది కొరత, రైతుల ఆగ్రహం వారిపైనే పడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. యాప్‌లో నమోదైన భూమి వివరాలు వాస్తవ పరిస్థితులకు సరిపోకపోవడం, కౌలు రైతుల పేర్లు లేకపోవడం కూడా పెద్ద లోపమే. కౌలు రైతులు యూరియా కోసం యజమాని మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతోంది.

యాప్ ద్వారానే యూరియా సరఫరా కొనసాగాలంటే కొన్ని కీలక మార్పులు అవసరం. ముందుగా గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా నమోదు, సవరణల సౌకర్యం కల్పించాలి. నెట్‌వర్క్ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ విధానాన్ని అనుమతించాలి.

అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు తాత్కాలిక వెసులుబాటు ఇవ్వాలి. కౌలు రైతుల గుర్తింపునకు ప్రత్యేక విధానం తీసుకురావాలి. యాప్‌పై ఆధారపడటమే లక్ష్యంగా కాకుండా, రైతుకు సమయానికి ఎరువు అందడమే ప్రధాన ప్రమాణంగా ప్రభుత్వం వ్యవహరించాలి.

సాంకేతికత ఒక సాధనం మాత్రమే. అది రైతు ప్రయోజనానికి ఉపయుక్తంగా ఉండాలి. యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం సరైన సవరణలతో, మానవీయ దృష్టితో అమలైతే వ్యవసాయ రంగానికి నిజమైన మేలు చేకూరుతుంది. లేదంటే అది రైతుల అసహనానికి, ఆగ్రహానికి, వ్యవసాయంపై నమ్మకం కోల్పోయే పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది. రైతు కేంద్రంగా ఆలోచిస్తేనే యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం విజయవంతమవుతుంది.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News