జనాలు బీరుకు, బిర్యానీకి, ఓటుకు నోటుకు అలవాటు పడ్డరు. గా నేతలు గట్ల అలవాటు శేసిండ్లు. ఇగ గదాన్నే నాయకులు, జనం కొనసాగిత్తున్నరు. నోటిత్తేనే ఓటేత్తమని, గట్లియ్యకపోతే, గా ఓటే ఏయ్యనోల్లు కూడా ఉంటున్నరు. కానీ, గీయినైతే గా ఓటుకిచ్చిన నోట్లను, గా ఓటుతోపాటే తిరిగిచ్చేసిండు? ఎట్లని ఆశీరపోతాండ్లా!?

గీ మద్దెలనే గా ఆంద్రల జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలైనయి. ఇగ ఓట్ల పెట్టెల్ని లెక్క కోసం తెరిత్తే, గండ్ల ఓ ఓటుతోటే ఓ శీటీ, రెండు ఐదొందల లోట్లూ లెక్కొచ్చినయి. ఇగ గా శీటీని ఇప్పి సూత్తే, గండ్ల ‘అయ్యా..! మీరిచ్చిన డబ్బులు రూ.1000 మీరే తీసుకోండి. డబ్బులు తీసుకొని ఓటు వేసే వారం కాదు సుమా.. ధన్యవాదాలు’ అని రాసి ఉంది. ఇగ గీ ముచ్చట ఆలశెంగా యెలుగులోకి ఒచ్చింది. గాయినెవలో గనీ, మేం మీ నోట్లకు ఓట్లమ్ముకునే రకం కాదని శెప్పుడే కాదుల్లా.. ఓటేసి, గా నోట్లు కూడా తిరిగిచ్చి గా ఓట్లకు పైసలిచ్చే రాజకీయ నాయకుల చెంప చెల్లుమనింపిండు!?

