Friday, October 16, 2026
34.3 C
Hyderabad

డ్రైవర్లు సెలవులో ఉంటే తామే రంగంలోకి!|PALAKURTHI|GRAMPANCHAYAT

సొంతంగా ట్రాక్టర్ నడుపుతూ ఇంటింటికీ నీటి సరఫరా..
పాలకుర్తి ప్రజాప్రతినిధుల అరుదైన దృశ్యం!

పదవులు ఉన్నాయి కదా అని కుర్చీలకో పరిమితం కాలేదు ఆ ప్రజాప్రతినిధులు. గ్రామంలో సమస్య వచ్చిందని తెలియగానే తామే స్వయంగా రంగంలోకి దిగారు. ‘మేము ప్రజల సేవకులం’ అని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ నిరూపించి అందరితో “శభాష్” అనిపించుకున్నారు పాలకుర్తి గ్రామ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్, ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్, వార్డు సభ్యులు మామిండ్ల కవిత శోభన్ బాబు, కమ్మగాని శ్రీకాంత్, ఎలమకంటి స్వప్న సతీష్ తదితరులు. సాధారణంగా గ్రామాల్లో ప్రతిరోజూ ఇంటింటికీ నీటి సరఫరా చేయడం గ్రామపంచాయతీ సిబ్బంది బాధ్యత. అయితే, ఈరోజు అనూహ్యంగా గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా సెలవు పెట్టారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఒక్కరోజు నీళ్లు రాకపోయినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆ ప్రజాప్రతినిధులు భావించారు. సిబ్బంది లేరని చేతులు ముడుచుకుని కూర్చోకుండా.. తామే స్వయంగా బాధ్యతను భుజానికెత్తుకున్నారు. పదవి ముఖ్యం కాదు.. ప్రజల అవసరమే ముఖ్యమని వార్డు సభ్యులు మామిండ్ల కవిత శోభన్ బాబు స్వయంగా ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి, వాహనాన్ని నడుపుకుంటూ గ్రామ వీధుల్లోకి వెళ్లారు. సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్, ఉపసర్పంచ్ గాదెపాక కిరణ్, వార్డు మెంబర్లు కలిసి గ్రామంలోని సిద్ధార్థ నగర్, టెంపుల్ కాలనీలో ప్రతి ఇంటికీ వెళ్తూ, ప్రజలకు తాగునీటిని అందించారు. ఒక పక్క ఎండ మండిపోతున్నా లెక్కచేయకుండా, వీధి వీధినా తిరుగుతూ గ్రామస్థుల నీటి అవసరాలను తీర్చారు. ప్రజాప్రతినిధులే నేరుగా ట్రాక్టర్ వేసుకుని వచ్చి నీళ్లు పోస్తుండటంతో పాలకుర్తి గ్రామస్థులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అధికారం చేతిలో ఉందని అహంకారం ప్రదర్శించకుండా, అత్యవసర సమయంలో తాము కూడా సాధారణ కార్మికుల్లా మారి సేవ చేసిన ఈ ఇద్దరు నాయకుల చొరవ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా వీరు ట్రాక్టర్ నడుపుతూ నీళ్లు పోస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. సమస్య వచ్చినప్పుడు సాకులు వెతకడం కాదు.. ఇలా పరిష్కారం చూపించే నాయకులే మాకు కావాలి అంటూ పాలకుర్తి ప్రజలు తమ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన ప్రజాసేవకులకు ఈ ఘటన ఒక అద్దం పడుతోంది.

Latest News

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

మానవాళి మనుగడకు ముప్పు!?|EDITORIAL

సాంకేతికత సృష్టిస్తున్న అద్భుతాల మాటునే వినాశనపు ఛాయలు కమ్ముకుంటున్నాయి! ఒకవైపు ఏఐ దుర్వినియోగం.. మరోవైపు అణుయుద్ధ భయాలు.. వెరసి మానవాళి మనుగడకే పెను సవాలు! వీటికి తోడు వాతావరణ మార్పులు, ఆహార సంక్షోభం...

అక్టోబర్ 14, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ తిధి చవితి రాత్రి 11.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనురాధ రాత్రి తెల్ల 03.18 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 09.08 వరకు ఉప6 సౌభాగ్య కరణం...

జాగిలాల కాలమిది!?|ADUGU TRENDS

అవుమల్ల.. కుక్కలకు కాలం చెల్లాలని ఒకకెల్లి ఆందోళనలు చెలరేగుతున్నయి. మరోకెల్లి గా ముధోళ్ ల గా జాగిలాల కాలమే నడుత్తాంది. గిదేందనుకుంటున్నరా? నిజమేనుల్లా... కుక్కలతోటి మనుసులది యిడదీయరాని అనుబంధం. మనిసితోటే కుక్కలు కూడా ఎదిగినయి....

ఎస్ఐఆర్ వెనుక రాజకీయ మర్మమేమిటి?|EDITORIAL

ఓటరు జాబితాల ప్రక్షాళన.. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు! ఎస్‌ఐఆర్‌ చుట్టూ ముదురుతున్న వివాదం.. వీధుల్లోకి విపక్షాలు.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనలు! ఓటు హక్కు రక్షణ పేరుతో రాజకీయ సమరం ఉధృతమవుతుంటే, నిరుద్యోగం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News