Sunday, April 12, 2026
25.7 C
Hyderabad

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు దారితీస్తున్నాయి. నగరాల సుందరీకరణ, పెట్టుబడులు, పర్యాటకం వంటి లక్ష్యాలు ఎలా ఉన్నా, ప్రజల కనీస నివాస హక్కులు, జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతున్నాయి.

ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర పాలనలో కూడా దేశంలో పేదరికం తొలగిపోలేదు. పాలకుల్లో నిజాయితీ, నిబద్ధత, దూరదృష్టి, చిత్తశుద్ధి లోపించడమే ఇందుక్కారణం. ప్రజలు కట్టే పన్నులను, వనరులను సమర్థంగా వినియోగించగలిగినా, సమాజంలో కనీస అభివృద్ధి సాధ్యమే. కానీ, పాలకులు సంక్షేమం పేరుతో తాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ, దీర్ఘకాలిక ప్రణాళికలను విస్మరిస్తున్నారు. పేదరికం నిర్మూలాంశం కాకుండా, నిరపేక్ష రాజకీయాంశంగా మారింది.

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారు. నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూశారు. తెలంగాణను తెచ్చామంటున్న కేసీఆర్ పాలనలో భారీ ప్రాజెక్టులు చేపట్టినా, వాటి అమలు అధ్వాన్నంగా మారింది. మల్లన్న సాగర్, కొండ పోచమ్మసాగర్ రిజర్వాయర్ల కోసం గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. వేలాది ఎకరాల భూములు సేకరించబడ్డాయి. కానీ ఆ ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన పునరావాసం, స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో విఫలమయ్యారు. పైగా ఆ నిర్వాసితులు గూడు విడిచిన పక్షుల్లా కకావికలమయ్యారు.

మూసీ నదిని శుద్ధి చేసి, సబర్మతి తరహాలో సుందరీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో, రూ.4,100 కోట్ల ఏడీబ్లోన్ రుణంతో, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుండి బాపూఘాట్ వరకు 20 కి.మీ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గాంధీ సరోవర్, పర్యాటక ప్రాంతాలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, గ్రీన్‌స్పేస్‌లు ఏర్పాటు చేస్తారు. 55 కి.మీ. మేర నది ప్రక్షాళన జరుగుతుంది, రూ.3,100 కోట్లతో ట్రంక్ ఇంటర్సెప్టర్ సీవర్ పైప్‌లైన్ పనులు కూడా చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 50 మీటర్ల బఫర్ జోన్‌తో సహా 3,279 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం డీపీఆర్ పూర్తి చేసి, పనులను వేగం చేస్తోంది. అయితే, భూసేకరణ, ప్రజల తరలింపు, పర్యావరణం, పునరావాసం వంటి వివాదాలు, అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ ప్రాజెక్టు అమలుపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వేలాది కుటుంబాలను తరలించక తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాలను పక్కన పెడితే, మరి నిర్వాసితులకి పునరావాసం ఎక్కడ కల్పిస్తారు? భూమి కోల్పోయిన వారికి భూమి ఇస్తారా? ఇళ్లు కోల్పోయిన వారికి సముచిత గృహాలు కట్టిస్తారా?

మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. అదే సమయంలో ఆ పరివాహకంలో నివసించే వారికి నివాసం, విద్య, వైద్యం, ఉపాధి, రవాణా వంటి సౌకర్యాలు అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఆ పరివాహక ప్రజలు కూడా ఈ మార్పును స్వాగతిస్తారు. లేకపోతే తిరగబడతారు. ప్రతిపక్షాల ఈ అవకాశం కోసమే కాచుక్కూచుకున్నాయన్నది మరవరాదు.

మూసీ ప్రక్షాళన, పర్యావరణ పునరుద్ధరణ, పర్యాటకాభివృద్ధి నగర భవిష్యత్తుకు అవసరమైన లక్ష్యాలే. కానీ వాటిని సాధించే ప్రక్రియలో ప్రజల జీవన హక్కులు దెబ్బతినకూడదు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు కేవలం మౌలిక వసతుల ప్రణాళికగా కాకుండా, సమగ్ర సామాజిక పునరావాస ప్రణాళికగా మారాలి.

అభివృద్ధి విజయవంతం కావాలంటే ప్రజల విశ్వాసం, భాగస్వామ్యం అవసరం. పారదర్శకంగా సాగితేనే మూసీ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తుంది. లేకపోతే అది మరో వివాదాస్పద ప్రాజెక్టుగా మిగిలిపోతుంది. అభివృద్ధి ప్రజల కోసం అయితేనే దానికి అర్థం ఉంటుంది. ప్రజలే ప్రథమం అనే సూత్రాన్ని గుర్తుంచుకుంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News