హైదారాబాద్, నవంబర్ 21 (అడుగు న్యూస్):
అమెరికా తెలుగు సంఘం (ఆటా) గత ఇరవై సంవత్సరాలుగా సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లో అనేక ప్రజాదరణ పొందిన కార్యక్రమాలను నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష సేవలందిస్తోందని, తమ లక్ష్యాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయడానికి ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ & ఆటా వేడుకల కమిటీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 12న రంగా రెడ్డి జిల్లాలో స్కూళ్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలు, డిసెంబర్ 13న సంగారెడ్డిలోని ఐఐటీలో స్టార్ట్-అప్ పిచ్ ఈవెంట్, డిసెంబర్ 14న హైదరాబాద్‌లో సాహిత్య కార్యక్రమం, డిసెంబర్ 16–17 తేదీల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో బిజినెస్ సెమినార్లు, డిసెంబర్ 20–23 మధ్య స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాటర్ ప్లాంట్ల ప్రారంభం, ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్, డిసెంబర్ 24–25 తేదీల్లో పిల్లల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్స్, చారిటబుల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, చివరి రోజు డిసెంబర్ 27న రవీంద్రభారతి లో గ్రాండ్ ఫినాలే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటా అవార్డుల ప్రదానం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం వచ్చే సంవత్సరం జులై 31 నుంచి ఆగస్టు 2 మధ్య అమెరికా మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో ఆటా మహాసభలను కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
TELUGU STATES|తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో ఆటా కార్యక్రమాలు|ATA

