Friday, October 2, 2026
24.4 C
Hyderabad

ప్రాచీన భారత చరిత్ర – ఆధారాలు|HISTORY|COMPITITIVE|EXAMS|SPECIAL

గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షల్లో ‘ప్రాచీన భారత చరిత్ర’ విభాగం నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చరిత్రను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన ఆధారాల గురించిన సమగ్ర విశ్లేషణ మీకోసం…

చరిత్ర – పదోత్పత్తి & అర్థం

హిస్టరీ (History):
ఈ పదం ‘historia’ అనే గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది. దీని అర్థం ‘పరిశోధన’ లేదా ‘అన్వేషణ’. గతాన్ని పరిశోధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అనవచ్చు.

చరిత్ర vs పురావస్తు శాస్త్రం:
ఈ రెండు శాస్త్రాలు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పటికీ వేర్వేరు మార్గాల ద్వారా పరిశోధిస్తాయి. చరిత్ర గత కాలాన్ని సాహిత్యం (లిఖిత ఆధారాలు) ద్వారా అధ్యయనం చేస్తే, పురావస్తు శాస్త్రం (Archaeology) వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేస్తుంది.

1. పురావస్తు ఆధారాలు (Archaeological Sources)
పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రను నిర్ధారించడానికి ప్రధానంగా శాసనాలు, నాణేలు, కట్టడాలు, శిల్పాలు మరియు తవ్వకాలలో బయల్పడిన వస్తువులను ఉపయోగిస్తారు.

ఎ) శాసనాలు (Inscriptions)
ఏదైనా ఒక గట్టి ఉపరితలంపై లిఖించబడిన శాశ్వత లిపిని శాసనం అంటారు. పురావస్తు శాస్త్రంలో శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఎపిగ్రఫీ’ (Epigraphy) అని, శాసనాలలోని ప్రాచీన లిపిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పేలియోగ్రఫీ’ (Palaeography) అని అంటారు.

శాసనాలలో రకాలు:

ప్రశస్తి శాసనాలు (Eulogies): ‘ప్రశస్తి’ అంటే పొగడ్త అని అర్థం. ఒక రాజు యొక్క విజయాలను, గొప్పతనాన్ని కీర్తిస్తూ వీటిని వేసేవారు.

ఉదాహరణలు:
సముద్రగుప్తుడి అలహాబాద్ ప్రశస్తి శాసనం, గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం, రెండవ పులకేశి ఐహోల్ శాసనం.

రాజాజ్ఞలు (Edicts):
రాజు తన ఉత్తర్వులను మరియు ఆజ్ఞలను ప్రజలకు తెలియజేస్తూ వేసే శాసనాలు. అశోకుడు వేసిన శాసనాలన్నీ రాజాజ్ఞలే.

దాన శాసనాలు (Land charters):
రాజుల దానధర్మాలు, విరాళాలు, ముఖ్యంగా పురోహితులకు లేదా మత సంస్థలకు ఇచ్చిన భూదానాల వివరాలు ఇందులో ఉంటాయి. ప్రశస్తి, రాజాజ్ఞలను కేవలం రాజులు మాత్రమే వేయిస్తే, దాన శాసనాలను రాజులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా వేయవచ్చు. వీటిని సాధారణంగా తామ్ర (రాగి) పలకల పైన ముద్రించేవారు.

ముఖ్య గమనిక: భారతదేశంలో తొలి శాసనాలుగా సింధు నాగరికత కాలం నాటి ముద్రికలపై ఉన్న చిత్రలిపిని చెప్పవచ్చు. అయితే వీటిని ఇప్పటివరకు ఎవరూ చదవలేకపోయారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో అశోకుడు వేయించిన శాసనాలే మన దేశంలో పండితులు చదవగలిగిన తొలి శాసనాలు. ఇవన్నీ ప్రాకృతం భాష, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి.

బి) నాణేలు (Coins)
నాణేలు ఆయా కాల నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, మతపరమైన విషయాలను తెలియజేస్తాయి. నాణేల అధ్యయన శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ (Numismatics)అంటారు.

తొలి నాణేలు:
మన దేశంలో క్రీ.పూ. 6వ శతాబ్దంలో ముద్రించిన నాణేలను తొలి నాణేలుగా పరిగణించవచ్చు. ఇవి వెండి, రాగితో చేసిన ‘విద్దాంక నాణేలు’ (Punch-marked coins). వీటిపై ఎటువంటి లిపి లేకపోవడం వల్ల రాజుల గురించి తెలుసుకునే అవకాశం లేదు, కేవలం బొమ్మలు మాత్రమే ఉంటాయి.

బంగారు నాణేలు:
కుషాణుల (మౌర్యుల తర్వాతి కాలం) తర్వాత భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజులు దేశంలో బంగారు నాణేలను ప్రవేశపెట్టారు.

సి) కట్టడాలు మరియు శిల్పాలు
ప్రాచీన కట్టడాలు, శిల్పాల అధ్యయనాన్ని ‘ఐకనోగ్రఫీ’ (Iconography)** అంటారు.

ఉదాహరణలు: తాజ్‌మహల్ ఆనాటి మొఘల్ చక్రవర్తుల వైభవోపేత జీవితాన్ని తెలియజేస్తుంది. అలాగే, కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయంలోని శిల్పాలు ఆనాటి సామాజిక స్థితిగతులను చెప్తాయి. వివాహిత స్త్రీలు మంగళసూత్రాన్ని ధరించే సాంప్రదాయం ఆ కాలంలోనే ఉన్నట్లు రామప్ప శిల్పాల ద్వారా తెలుస్తోంది.

డి) తవ్వకాలలో బయల్పడిన వస్తువులు & కాలనిర్ణయ పద్ధతులు
తవ్వకాల్లో దొరికిన కుండలు, ఆహారధాన్యాలు, వస్త్రాలు, ఆయుధాలు, ఆభరణాలు ఆనాటి పరిస్థితులను తెలియజేస్తాయి. (ఉదాహరణకు: హరప్పా, లోథాల్, కాళీబంగన్ అవశేషాలు సింధు ప్రజల జీవన విధానాన్ని చెప్తాయి). ప్రాచీన వస్తువుల కాలాన్ని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు కింది పద్ధతులను ఉపయోగిస్తారు:

రేడియో-కార్బన్ డేటింగ్ (Radio-Carbon Dating)

పొటాషియం – ఆర్గాన్ డేటింగ్ (Potassium – Argon Dating)

థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ (Thermoluminescence Dating)

డెండ్రోక్రోనాలజీ డేటింగ్ (Dendrochronology Dating – వృక్ష వలయాల ఆధారంగా)

యురేనియం-లెడ్ డేటింగ్ (Uranium-lead Dating)

2. చారిత్రక / లిఖిత ఆధారాలు (Literary Sources)
చరిత్రకారులు గతాన్ని లిఖిత ఆధారాల ద్వారా కూడా అధ్యయనం చేస్తారు. ఇవి రెండు రకాలు: స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు.

ఎ) స్వదేశీ గ్రంథాలు
భారతదేశంలో స్థానిక పండితుల ద్వారా రాయబడిన ఈ గ్రంథాలు మళ్లీ రెండు రకాలు:

మత గ్రంథాలు:
వివిధ మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలు. ఇందులో హిందూ (బ్రాహ్మణ), జైన, బౌద్ధ గ్రంథాలు ఉంటాయి. క్రీ.పూ. 1500 – 1000 మధ్య రచించబడిన ‘ఋగ్వేదం’భారతదేశంలోనే తొలి గ్రంథంగా పరిగణించబడుతుంది.

లౌకిక గ్రంథాలు:
ఏ మతానికి సంబంధం లేని సాధారణ గ్రంథాలు. క్రీ.పూ. 4వ శతాబ్దంలో పాణిని సంస్కృత వ్యాకరణంపై రాసిన ‘అష్టాధ్యాయి’ మన దేశంలో తొలి లౌకిక గ్రంథము.

బి) విదేశీ గ్రంథాలు
ప్రాచీన కాలం నుండి భారతదేశాన్ని సందర్శించిన విదేశీ రాయబారులు, యాత్రికులు, వ్యాపారస్తులు తమ అనుభవాలను గ్రంథస్థం చేశారు. స్వదేశీ సాహిత్యంతో పోలిస్తే విదేశీ సాహిత్యంలో పక్షపాత వైఖరి తక్కువగా ఉంటుంది మరియు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఇవి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి.

గ్రీకు గ్రంథాలు: మెగస్తనీస్ రాసిన ‘ఇండికా’ గ్రంథం మౌర్యుల కాలం నాటి విశేషాలను తెలియజేస్తుంది.

లాటిన్ గ్రంథాలు: ప్లినీ రాసిన **’నాచురల్ హిస్టరీ’** ప్రాచీన కాలంనాటి ఇండో-రోమన్ వ్యాపారం గురించి తెలుపుతుంది.

చైనీస్ గ్రంథాలు: 7వ శతాబ్దంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన హర్షవర్ధనుడి గురించి హుయాన్ త్సాంగ్ రాసిన **’సి-యు-కి’** గ్రంథం ప్రముఖమైనది.

టిబెటన్ గ్రంథాలు:
‘దివ్యవదన’ అనే టిబెటన్ బౌద్ధ గ్రంథము అశోకుడి గురించి తెలియజేస్తుంది.

శ్రీలంక గ్రంథాలు:
మహావంశ, దీపవంశ మరియు కులవంశ అనే సింహళ గ్రంథాలు మౌర్యుల చరిత్రను అందిస్తాయి.

అరబిక్ గ్రంథాలు: మధ్యయుగంలో భారతదేశాన్ని సందర్శించిన అనేక మంది అరబ్బు యాత్రికులు దేశ పరిస్థితులపై విలువైన సమాచారాన్ని ఇచ్చారు.


– బానోత్ కళ్యాణ్

Latest News

గురువుకు పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక!?|ADUGU TRENDS

గురువంటే విద్యా బుద్ధులు నేర్పేవాడే కాదు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. భావి భారతానికి బాటలు వేసే వాడు. గిట్లనే సదువుకుని ఎదిగిన, గీ ముచ్చట ఎరిగిన గా సదువుకున్న పొల్లగాండ్లు గా సారును...

జయహో స్మిత్ మచ్చర్…ధైర్యానికి సెల్యూట్!|EDITORIAL

ఆకాశంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న క్షణం.. ఓ కెప్టెన్‌ అసమాన ధైర్యం వందల ప్రాణాలకు రక్షణ కవచమైంది! తీవ్ర గాయాలు.. కాక్‌పిట్‌లో దాడి.. అదుపుతప్పుతున్న విమానం.. అయినా వెనుకడుగు వేయని స్మిత్ మచ్చర్!...

అక్టోబర్ 02, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి షష్ఠి పగలు 12.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి ఉదయం 07.20 వరకు ఉపరి మృగశిర యోగం వ్యతీపాత రాత్రి 09.54 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి పగలు 12.13 వరకు ఉపరి...

పాలిచ్చే ఏటీఎం!?|ADUGU TRENDS

అవుమల్ల.. గిప్పటిదాకా పైసలిచ్చే ఏటీఎంను సూసినం. గట్లనే టికెట్లనిచ్చే ఏటీఎంలను గూడ సూసినం. కానీ, గీ పాలిచ్చే ఏటీఎంను ఎక్కడైనా సూసినమా? కానీ, గా సిద్దిపేట జిల్ల గజ్వేల్ ఒకాయినె గీ పాల...

డ్రాగన్ తో గగనతల చర్చలు సఫలమయ్యేనా!?|EDITORIAL

భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువుల కంటే శాశ్వత ప్రయోజనాలే కీలకం. భారత్–చైనా సంబంధాల్లోనూ అదే వాస్తవికత పనిచేయాలి. విమానాలకు గగనతలం లభించడం తక్షణ ప్రయోజనం కావచ్చు. కానీ, రెండు దేశాల...

అక్టోబర్ 01, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి పంచమి పగలు 02.30 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక ఉదయం 08.50 వరకు ఉపరి రోహిణి యోగం సిద్ది రాత్రి 12.57 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు 02.30 వరకు ఉపరి...

అమ్మకానికో ఊరు..! నీల్లిత్తే సాలు!?|ADUGU TRENDS

ఇప్పటిదాకా వస్తువులమ్మడం సూసినం. ఆస్తులనమ్మడం సూసినం. కానీ, ఊరినే అమ్మకానికి పెట్టడం ఎక్కడైనా సూసినమా? కానీ, గా ఊరును నిజంగనే గా ఊరోల్లు అమ్మకానికి పెట్టిండ్రు. గది కూడా వట్టి నీల్లకే!? గది మహారాష్ట్ర....

ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడమే అసలైన పరీక్ష!|EDITORIAL

ఎల్‌నినో బలహీనపడాలని, సమయానుకూలం గా వర్షాలు కురవాలని కోరుకోవడం సహజమే. కానీ వాతావరణాన్ని మార్చలేం. దాని ప్రభావాన్ని తగ్గించే వ్యవసాయ విధానాలను మాత్రం ముందుగానే రూపొందించవచ్చు. ఇదే ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు, శాస్త్రవేత్తలు,...

సెప్టెంబర్ 30, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చవితి సాయంత్రం 04.35 వరకు ఉపరి పంచమి నక్షత్రం భరణి ఉదయం 10.08 వరకు ఉపరి కృత్తిక యోగం హర్షణ ఉదయం 06.37 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ సాయంత్రం 04.35 వరకు ఉపరి...

తెలంగాణలో… కమల వికాసం కలేనా!?|TELANGANA|BJP

రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉందా? కాషాయంలో అంతర్గత కలహాలు! కావాల్సిన కసరత్తేది? కార్యాచరణేది? పార్టీకి సత్తువెక్కడ? సమన్వయం ఎక్కడ? సీనియర్లకు, కార్యకర్తలకు గుర్తింపేది? సమీక్షలున్నాయా? సవరింపులున్నాయా? పెరుగుతున్న పార్టీకి... పెరగని గ్రామీణ బలం! కేంద్ర పదవులు... రాష్ట్రానికి ఉపయోగమేనా? బూత్ కమిటీలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా? కొత్త...

ఇంద్రుడి మీద న్యాయమూర్తికి ఫిర్యాదు!?|ADUGU TRENDS

వాన దేవుడు వానలు కురిపిత్తరని మనం నమ్ముతం. గా వానాకాలం, సలికాలం, ఎండాకాలమని ఓ లెక్క పకారం వత్తయి. గీ మద్దెల గయి కూడా లెక్క తప్పినయి. పడితే ఒకటే వాన.. లేకపోతే...

మాటలు మంటలు రేపితే.. యుద్ధం ఎక్కడ ఆడుతుంది.!?|EDITORIAL

శాంతి చర్చలు సాగాల్సిన వేళ.. అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షిపణుల హెచ్చరికలతో ప్రపంచం వణుకుతోంది.. చమురు ధరలు కదులుతున్నాయి.. ఆర్థిక వ్యవస్థలు ఆందోళనలో పడుతున్నాయి. ఒకవైపు సైనిక ఒత్తిడి.....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News