Tuesday, September 15, 2026
22.8 C
Hyderabad

KONDA FAMILY|కొండా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

DISCPLINE|క్రమశిక్షణ కమిటీకే తప్పుడు నివేదిక!
అన్ని పార్టీలు మారింది ఆ కుటుంబమే
‘కొండ’పై NAINI|నాయిని ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన CONGRESS|కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

వరంగల్, మే 30 (అడుగు న్యూస్):
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తప్పుడు సమాచారం ఇచ్చారని, షోకాజ్ నోటీసు ఇచ్చినందుకు హాజరై నన్నెవ్వరూ పిలవలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని, పార్టీ మారలేదని చెబుతున్న కొండా కుటుంబానిది అన్ని పార్టీలు మారిన చరిత్ర అని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య విమర్శించారు. ‘కొండ’ వ్యవహారంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధిష్టానం డెడ్ లైన్ గా విధించిన 5వ తేదీ వరకు వేచి ఉండాలని నిర్ణయించారు.

అనంతరం మీడియాతో బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, 38 ఏళ్లుగా కాంగ్రెస్‌ను బతికించానంటూ కొండా మురళి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలన్నారు. కొండా కుటుంబానికి టీడీపీ రాజకీయ జన్మనిస్తే, తర్వాత కాంగ్రెస్, ఆతర్వాత వైఎస్సార్ సీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లకు మారారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వారు, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలిపించామనడం హాస్యాస్పదం అన్నారు. గతంలో సోనియా గాంధీని బూతులు తిట్టిన వ్యక్తి ఇప్పుడు పార్టీ సేవలు, పార్టీ నాయకత్వంపై గురించి మాట్లాడటం దారుణం. క్రమశిక్షణ కమిటీపై కూడా కొండా కుటుంబానికి గౌరవం లేదు. కొండా పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలి. ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ నాయకత్వాన్ని తిట్టడం ఈ కుటుంబానికి అలవాటైంది” అంటూ ధ్వజమెత్తారు. జూలై 5 వరకు కాంగ్రెస్ అధిష్టానం కొండా మురళిపై తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తాం. పార్టీ డిసిప్లిన్‌కు మించి ప్రవర్తించే వారిని సహించలేమంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

‘తూర్పు’ అసెంబ్లీలో రూ.70 కోట్లు ఖర్చా?
స్వయంగా వెల్లడించిన కొండా మురళి
వివాదాస్పదమవుతోన్న మంత్రి కొండా సురేఖ భర్త వ్యాఖ్యలు

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు పెట్టారా? అంటే అవుననే సమాధానం వేరే ఎక్కడి నుంచో రావడం లేదు. స్వయంగా ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ నోటి నుండే వెలువడ్డాయి. ఇప్పుడు అవే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న వరంగల్ లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరినీ ఆశించలేదన్నారు. ‘మా నాన వతన్ దార్. ఇంకా 500 ఎకరాల ఉన్నది నాకు. 70 కోట్లు ఖర్చు పెట్టిన. మీకందరికీ తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. వివాదాస్పదమవుతున్నాయి. రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలను తూలనాడిన ఘటన, ఆ ఘటనపై వివరణ ఇవ్వడానికి గాంధీ భవన్ కు వెళ్ళి క్రమశిక్షణా కమిటీకి ఇచ్చిన 6 పేజీల ఫిర్యాదు, ఆ తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టొద్దంటూ చేసిన ఘాటైన మాటలు మరచిపోక ముందే తాజా వ్యాఖ్యలు ఇప్పటికే ఉన్న వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది. కొండా మాటలను తీవ్రంగా పరిగణిస్తున్న ఆయన ప్రత్యర్థులు ఆయన సతీమణి, మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ కు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయండి!
శాసన సభ్యత్వాన్ని రద్దు చేయండి
సుమోటోగా స్వీకరించి, విచారించాలని బీజేపీ డిమాండ్

ఎన్నికల నియమాళికి విరుద్ధంగా గత అసెంబ్లీ ఎన్నికలో తూర్పు నియోజకవర్గం నుంచి తన సతీమణి, ప్రస్తుత మంత్రి కొండా సురేఖను రూ.70 కోట్లు పెట్టి, గెలిపించానని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్వయంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కోర్టు, ఎన్నికల కమిషన్ విచారించాలని, ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆమె శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత ఎన్నికలో ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. కొండా సురేఖ తమ అఫిడవిట్ లో తన పేరు మీద ఒక ఎకరం, తన భర్త కొండా మురళి పేరున 13.31 ఎకరాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారన్నారు. కానీ ప్రస్తుతం కొండా మురళి తమకు 500 ఎకరాలున్నట్లు చెప్పారన్నారు. అందులో 16 ఎకరాలమ్మి రూ. 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పారని పేర్కొన్నారు. 16 ఎకరాలు అమ్మితే రూ.70 కోట్లు వచ్చాయా? ప్రభుత్వానికి పన్ను కట్టారా? మొత్తానికి కొండా మురళి వ్యాఖ్యలతో సురేఖ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని తేలిందన్నారు. అంతేగాక రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం ద్వారా ప్రజల్ని కూడా అవమానించారని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని అన్నారు. ఈ ఆధారాలతో తాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, కోర్టులోనూ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నైతిక బాధ్యత వహించి, కొండా సురేఖ తమ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. లేదంటే సీఎం తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest News

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News