Wednesday, July 29, 2026
22.6 C
Hyderabad

JUBILEE HILLS|జూబ్లీ హిల్స్ లో… ‘నవీన’ కాలం!|NAVEEN YADAV

-‘నవాం’శతో నెగ్గిన నవీన్ యాదవ్
-జూబ్లీ హిల్స్ లో పాగా వేసిన కాంగ్రెస్
-హైదరాబాద్ లో బోణీ కొట్టిన హస్తం
-ప్రత్యామ్నాయంగా నిలిచిన బీఆర్ఎస్
-డిపాజిట్ కోల్పోయి డీలాపడిన బీజేపీ

రాష్ట్రంలో 25శాతం జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. బీఆర్ఎస్ మరో సీటుకు గండి కొట్టింది. రాజధాని పై పట్టు బిగించింది. జూబ్లీ హిల్స్ లో పాగా వేసింది. కమ్మల కంచుకోటలో బీసీని గెలిపించింది. భాగ్య నగరంలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ లో జూబ్లీ హిల్స్ సీటు కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయంగా నిలిచింది. డిపాజిట్ ను కూడా కోల్పోయిన బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న అపవాదును మూటగట్టుకుంది.

హైదరాబాద్, నవంబర్ 14 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీలో ఊపునిచ్చింది. కొత్త ఉత్సాహాన్ని నింపింది. నువ్వా? నేనా? అన్నట్లుగా ప్రచారం సాగిన జూబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిచింది. 26,729 ఓట్ల బంపర్ మెజార్టీని సాధించింది. రాజధాని నగరంలో సీటే లేదన్న కాంగ్రెస్ జూబ్లీలో పాగా వేయడంతోపాటు, మహానగరంలో బోణీ కొట్టింది. బీఆర్ఎస్ సిటింగ్ సీటును కోల్పోయింది. బీజేపీ డిపాజిట్ ను కోల్పోయింది. అయితే జూబ్లీలో కాంగ్రెస్ గెలుపుకంటే, నవీన్ ఎన్నిక ప్రచారమే ఎక్కువగా సాగింది. నవీన్ విజయం వెనుక అనేక అంశాలు పని చేశాయి.

నవీన్ యాదవ్ ఎంపిక
కాంగ్రెస్ విజయంలో నవీన్ యాదవ్ ఎంపికే సగం గెలుపుగా మారింది. గతంలో కార్పొరేటర్ గా, ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా, మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఓటమి చవి చూసిన నవీన్ కు కలిసి వచ్చింది. ఆయనకున్న పరిచయాలు, సానుభూతి పండింది.

బీసీ కావడం
కమ్మల కోటలో బీసీ అభ్యర్థిని నిలపడం సీఎం రేవంత్ రెడ్డి చేసిన తెలివైన వ్యూహం, సాహసం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి అది కమ్మల అధీనంలో ఉంది. మూడు సార్లు వరసగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్ గెలుస్తూ వచ్చారు. 2014లో టీడీపీ, 2018లో టీఆర్ఎస్, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనే గెలిచారు. పార్టీలు సైతం కమ్మలకే ఈ సీటును కేటాయిస్తూ వచ్చారు. కానీ ఈసారి వ్యూహాత్మకంగా బీసీల ఓట్లు అధికంగా ఉన్న జూబ్లీలో బీసీ అయిన నవీన్ యాదవ్ ఎంపిక కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.

స్థానిక ముద్ర
నవీన్ యాదవ్ స్థానికుడు. స్థానికంగా పట్టున్నవాడు. అయితే ప్రత్యర్థి సునీత దివంగత ఎమ్మెల్యే రెండో భార్య. స్థానికేతర మూలాలున్న వారి నేపథ్యం నవీన్ కు కలిసి వచ్చింది. స్థానిక, స్థానికేతర ప్రచారం విపరీతంగా జరగకపోయినప్పటికీ, నవీన్ తనను తాను స్థానికుడిగా చెప్పుకోవడంతోపాటు ఓటర్లు కూడా నవీన్ యాదవ్ ని స్థానికుడిగా గుర్తించి ఓట్లేశారు.

కష్టమొచ్చినా, తెచ్చినా నవీనే!
ఇది జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకించి, యూసుఫ్ గూడలో వినిపించే కామెంటు. కొన్ని సందర్భాల్లో కొందరి కష్టం కలిగించిన పేరున్న నవీనే, ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాడన్న పేరు వచ్చింది. దీంతో మంచికైనా, చెడుకైనా మనోడే అన్న భావన స్థానిక ఓటర్లలో నాటుకుపోయింది. అది ఓట్లుగా పడింది.

అజహర్ కు మంత్రి పదవి
మైనార్టీ ఓట్లు కూడా అధికంగా ఉన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అజహరుద్దీన్ కు మంత్రి పదవిని తెచ్చి పెట్టింది. పదే పదే బీఆర్ఎస్ చేసిన విమర్శల ఫలితంగా, జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీలు అజహరుద్దీన్ కు మంత్రి పదవినిచ్చారు. ముస్లీంలకు అండగా కాంగ్రెస్ ఉంటుందనే భరోసా కల్పించారు. మెజార్టీని బట్టి ముస్లింల ఓట్లు నవీన్ కే పడ్డాయన్న రూఢీనిస్తున్నాయి.

స్వయంగా సీఎం ప్రచారం
ఈ ఉప ఎన్నికను అందరికంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వయంగా తానే రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక నుండి ఆయన్ని గెలిపించే వరకు అన్నీ తానై పని చేశారు. తన ఎన్నికలో లాగే ప్రచారం చేశారు. వారం రోజులు సీఎం జూబ్లీ నియోజకవర్గంలోని గల్లీల్లో ప్రచారం చేశారు. స్థానిక ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న భరోసాని కల్పించారు.
మంత్రులు, పార్టీ శ్రేణుల మోహపరింపు
ఒక్కో డివిజన్ లో ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్త పార్టీ శ్రేణులను దించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రచారానికి దీటుగా ప్రజల్లో ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ పట్ల నమ్మకాన్ని కలిగించగలిగారు.

ప్రచారంలో ముందంజ
దీంతో ప్రత్యేకించి బీఆర్ఎస్ కు మించిన ప్రచారం చేయగలిగారు. ఒకవైపు బీఆర్ఎస్ పై విమర్శలు, మరోవైపు ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ తాను ఓడి, బీఆర్ఎస్ ను గెలిపించే కుట్ర పన్నిందని ప్రజల్లో బాగా తీసుకెళ్ళారు. సీఎం ఆరోపణలను నిజమా? అన్నట్లుగానే బీజేపీ డిపాజిట్ కోల్పోవడం విస్మయానికి గురి చేసింది.

పోల్ మేనేజ్ మెంటు
పోల్ మేనజ్ మెంట్ కూడా ఈసారి కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. బీఆర్ఎస్ కంటే ఎక్కువ డబ్బులు, బట్టలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. అలాగే ప్రతి ఓటర్ నూ కలిసి, ఆ ఓటు తమకే పడేట్లు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

దీనికి తోడు బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు, లోపాలు కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. ప్రత్యేకించి అభ్యర్థి రౌడీ అంటూ చేసిన వ్యక్తిత్వ హననం ప్రచారం బీఆర్ఎస్ కు బెడిసి కొట్టింది. రాజకీయంగా ఆఖరి అస్త్రం అంతగా పనిచేయకపోగా, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాగంటి రెండో భార్యగా ప్రచారం జరిగింది. పైగా మాగంటి తల్లి, కోడలు, కొడుకు పోలీస్ స్టేషన్లలో చేసిన ఫిర్యాదులను ప్రజలు పట్టించుకుంటున్నారు. పైగా ఆమె అభ్యర్ధిత్వం కంటే కేటీఆర్, హరీశ్ రావులే ప్రచారం మొత్తం కనిపించారు. అధికారంలో ఉన్న విధంగానే ప్రవర్తించారు. సొంత సోషల్ మీడియాను ఉసి గొల్పినా, ప్రజలు పట్టించుకోలేదు. సొంత సర్వేలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. వాటికి జనం ప్రభావితం కాలేదు. అయితే ఈ ప్రచారాలన్నీ ప్రత్యర్థిని, ఆయన పార్టీని అలర్ట్ చేశాయి. దీంతో వారు మరింత పకడ్బందీగా తయారయ్యారు.
ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి, అభ్యర్థి నవీన్ యాదవ్ కు కలిసి వచ్చిన అంశాలు.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News