Friday, August 21, 2026
28.2 C
Hyderabad

కొండా సురేఖ చుట్టూ రాజకీయ ఉచ్చు..|KONDA SUREKHA|CONGRESS|CM|REVANTH REDDY

పార్టీ నుంచి బహిష్కరించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు|MLA|MLC

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు సొంత పార్టీలోనే పెను రాజకీయ తుఫానుకు దారితీశాయి. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చినప్పటికీ పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు శాంతించలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వర్గానికి చెందిన ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కతాటిపైకి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ బహిరంగంగా ఖండించకపోతే కుదరదని, పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచే కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని అధిష్ఠానాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమని, కానీ అధికారంలో ఉంటూ సొంత పార్టీ నేతలే ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించి అధికారంలోకి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

మరో విప్ వేముల వీరేశం స్పందిస్తూ, గతంలో సినిమా నటి సమంత విషయంలోనూ కొండా సురేఖ వాడిన అభ్యంతరకర భాష పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందని గుర్తుచేశారు. సొంత ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పార్టీని బలిచేయాలని చూస్తే సహించబోమని, సీఎం నిర్ణయాలను తప్పుపట్టే వారికి పార్టీలో కొనసాగే హక్కు లేదని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌ను రాజకీయంగా బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే బాలు నాయక్ ధ్వజమెత్తారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతటివారైనా కులం, హోదాలతో సంబంధం లేకుండా తక్షణమే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని, షోకాజ్ నోటీసులతో సరిపెట్టకుండా శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కొండా దంపతుల వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయడం వారికి అలవాటుగా మారిందని, ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క ఎమ్మెల్యేతోనైనా సఖ్యతగా ఉన్నారా అని ప్రశ్నించారు. గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీ-ఫారాలు తీసుకొని వదిలి వెళ్లిన చరిత్ర వారిదని, ఇప్పుడు మళ్లీ అధికారం దక్కగానే ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీ కార్డును అడ్డం పెట్టుకుని పార్టీని బ్లాక్‌మెయిల్ చేయాలని చూడడం సరికాదని, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పార్టీ మెజారిటీ గణనీయంగా తగ్గిందని ఎత్తిచూపారు.

వేలాది మంది కార్యకర్తల చెమట, త్యాగాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా వ్యవహరిస్తున్న కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మధుసూదన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్, వెడ్మ బొజ్జు, బుయ్యని మనోహర్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, బత్తుల లక్ష్మా రెడ్డి, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

Latest News

గిదో కుక్కల కు.ని. పంచాయితీ!?|ADUGU TRENDS

గీ మద్దెల కుక్కల రోజులొచ్చినయి. మనుసుల లెక్కనే గా కుక్కల జనాభా కూడా పెరిగింది. గవి జనం మీదకు ఎగపడుడు. కరుసుడు, పీక్కతినుడు కూడా ఎక్కువై పోయింది. గ వాట్ని సంపుదామంటే, జీవ...

వంటింటిపై ధరల దాడీకి బాధ్యులెవరు!?|EDITORIAL

బియ్యం కిలో ధర ఎంతకు చేరిందన్నది కోట్ల కుటుంబాల వంటింటి సమస్య. అందుకే రాజకీయ ఎజెండాల మధ్య ప్రజల ఎజెండా కనుమరుగుకాకూడదు. ధరల పెరుగుదలను “మా పరిధిలో లేదు” అని చెప్పడం కాదు....

ఆగస్టు 21, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శ్రీ వరలక్ష్మి వ్రతం తిధి శు.నవమి రాత్రి 11.20 వరకు ఉపరి దశమి నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 01.03 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం ఐంద్ర ఉదయం 06.49 వరకు ఉపరి వైధృతి కరణం బాలవ ఉదయం 10.28...

అవును..గ వాల్లు మల్లా మనువాడిండ్రు!?|ADUGU TRENDS

గ వాల్లు ఇప్పటికే ఆలుమొగలు. గవాల్లకు పిల్లలు గూడా ఉన్నరు. గా పిల్లలు సదువుకుంటాండ్రు. గివీల్లు సంసారం కూడా శేసుకుంటాండ్రు. అయినా గవాల్లు కొత్తగా మల్లా మనువాడిండ్రు. మూడుమల్లేసుకున్నరు. ఏడడుగులు నడిసిండ్రు. గట్ల...

బీజేపీ ముందున్న సవాళ్ళివే!?|EDITORIAL

బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ప్రచార వ్యూహాలకంటే పాలనా ఫలితాలపై దృష్టి పెట్టాలి. ధరల నియంత్రణ, ఉపాధి సృష్టి, విద్యా, వైద్య రంగాల బలోపేతం, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడం,...

ఆగస్టు 20, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.అష్టమి రాత్రి 09.33 వరకు ఉపరి నవమి నక్షత్రం విశాఖ ఉదయం 10.50 వరకు ఉపరి అనురాధ యోగం బ్రహ్మ ఉదయం 06.33 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 08.54 వరకు ఉపరి బవ రాహుకాలం...

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News