శేద బాయిలు, బోరింగుల నీల్లు తాగే రోజులే పోయినయి. ఇగ అంతా పిల్టర్, బాటిల్ల నీల్లే తాగబడ్తిరి. మరి గా కొనుక్కునే నీల్ల క్యాన్లు 20 లీటర్లుండబట్టే. గవాటికి మూతలు ఒకపాలి తీత్తే మల్ల పెట్టుడు కట్టమేనాయె. మరి గిదీనికి ఓకాయెనె మంచి ఇకమతు శేసిండు.

గా మంచినీల్ల క్యాన్ మూతికాడ సుట్టూతా లబ్బర్ పెట్టిండు. గా లబ్బర్ మీద, కోసేసిన ఓ సీసా పై బాగాన్ని గట్టిగ పెట్టిండు. గదాన్ని కొద్దిగ యేడి పెట్టి బిగ్గర శేసిండు. ఇగ గదానికి గా సీస మూతే పెట్టిండు. ఇగ నీల్లు తాగేటప్పడు గా మూత తీయొచ్చు. ఐటెంక గదాన్ని పెట్టొచ్చు. ఎట్లుంది. గీ ఇకమతు? మీరూ శేసి సూడుండ్రి మరి!

