Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

అడ్డూ అదుపు లేని ధరల దోపిడీ!

ఆహార పంటలు అధికంగా పండుతున్న అన్నపూర్ణ లాంటి దేశంలో అదే ఆహార ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రకరకాల పరోక్ష పన్నుల స్థానంలో వస్తువులు మరియ సేవల (జీఎస్టీ) పన్ను విధానం అమలుతో గతంలో మినహాయింపు ఉన్న వస్తువులు సహా అన్ని రకాల వస్తువులపై పన్నులు అధికమయ్యాయి. దీనికి తోడు అడ్డూ అదుపు లేని పెట్రో, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, వీటిపై కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా వేస్తున్న పన్నులు తడిసి మోపెడు అవుతున్నాయి. అసలు ఒక పన్నుల పద్ధతే లేకుండాపోయింది. ఆదాయ సముపార్జనే ధ్యేయంగా ప్రభుత్వాలు పని చేస్తుండటం పేదల పాలిట శాపంగా మారింది. అధికారం కోసం నానా గడ్డీ కరిచే పార్టీలు, పాలకులు మొసలి కన్నీరు కారుస్తూ, ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తున్నాయి.

నిజానికి ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని వచ్చిన జీఎస్టీ ఇప్పుడు సామాన్యులకు గుదిబండగా మారింది. పాన్‌, ఆధార్‌ లింక్‌ కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది. దీనికితోడు కనీసం చార్జీగా వేయి రూపాయలను వడ్డిస్తున్నారు. తాజాగా యూపిఎ చెల్లింపులపై ట్యాక్స్‌ విధించే ఆలోచన దుర్మార్గం కాక మరోటి కాదు. అప్పుడెప్పుడో తుగ్లక్ కాలంలో జుట్టు పన్ను కూడా విధించారు. ఇప్పుడు అదే తరహాలో పన్నులేని పని, వస్తువు, సేవలు లేకుండా పోయాయి. పన్నుల రూపంలో ప్రజలు ఇల్లు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

అన్ని రకాల వస్తు సేవలపై ప్రభావం చూపే పెట్రో, డీజిల్, గ్యాస్‌, జిఎస్టీ ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ, దేశీయంగా పెట్రో ధరలను పెంచి తీరాలన్న నియమమేమీ లేదు. కానీ అలా పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ లు ఇప్పుడు కేంద్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. పెట్రో ధరల పెంపు ప్రభుత్వం అనుసరించే ద్రవ్య వ్యూహాన్ని బట్టి ఉంటుంది. ఈ ద్రవ్య వ్యూహాన్ని ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు మార్చుకునే వీలున్నా, అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంతర్జాతీయ చములు నిలువలు, ధరల సాకుతో పెట్రో ధరలను తమకు ఇష్టం లేకున్నా పెంచవలసి వస్తోందని వాపోవడం ప్రభుత్వాల దొంగనాటకానికి నిదర్శనం. పెట్రో ఉత్పత్తుల ధరల్లో సగానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకే పోతుంది. ఈ పన్నులకి, అంతర్జాతీయ చమురు ధరలకి సంబంధమే లేదు. అయినా ఆ పన్నులను పెంచుకుంటూ ప్రభుత్వాలే ప్రజల్ని దోచుకుంటున్నాయి. కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో పన్నులు పెంచుతోంటే, రాష్ట్రాలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చా పన్నుల్లో కేంద్రం గుత్తాధిపత్యం పెరిగి, రాష్ట్రాల పన్నుల వాటా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రాలు తమ పరిమితమైన ఆదాయ వనరులను పెంచుకోవడానికి పన్నులకు ఎగపడుతున్నాయి. పైగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పెట్రో ఉత్పత్తుల విూద పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు విధించే అధికారం లేనందువలన వాటికి వేరే దారి లేదు. కాని కేంద్ర ప్రభుత్వం వేరు. వేర్వేరు మార్గాల్లో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా, కావాలనే కేంద్రం ఆ మార్గాలను ఉపయోగించడంలేదు.

సంపన్న వర్గాలే పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తాయి గనుక పెట్రో ఉత్పత్తుల విూద ధరలు పెరిగితే ఆ భారం పేదల మీద పడదనేది తప్పుడు వాదన. ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు పెట్రో ఉత్పత్తులను అధికంగా వినియోగిస్తున్నది పేద మధ్య తరగతి వర్గాలే. నిజానికి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే, రవాణా చార్జీలు, వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఇదంతా ఒకదానిపై ఒకటిగా ఆధారపడి ఉండే చైన్ సిస్టమ్. ఆహార ధాన్యాలను, నిత్యావసర సరుకులను ఎక్కువగా ఉపయోగించేది కూడా నిరుపేద, మధ్యతరగతి వారే. ఉన్నత, సంపన్న వర్గాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పెరిగే ధరల ప్రభావం కూడా వాటిని వినియోగించే పేద మధ్య తరగతి మీదే భారంగా పరిణమిస్తున్నది. అంతిమంగా ధరలు పెరిగి వినియోగం తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గుతుంది. నిరుద్యోగిత పెరుగుతుంది. ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంతా కలిసి ఆర్థిక సంక్షోభానికి ఆస్కారం ఏర్పడుతుంది.

ప్రభుత్వాలకు నిజాయితీ ఉంటే ప్రత్యామ్నాయ ద్రవ్య విధానాన్ని అమలు చేయాలి. అదికూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి. అప్పుడే ప్రజలపై భారం తగ్గుతుంది. జీఎస్టీతో ప్రజలు అల్లాడుతున్నా, పన్నులు కట్టలేక చస్తున్నా, పెట్రోల్‌ ధరలతో దాడులు చేస్తున్నా, పట్టించుకోని, పైగా వాటిని పెంచుతున్న ప్రధాని మోడీ, రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ ను తగ్గించాలని సూచిస్తున్నారు. రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోకుండానే, ప్రజల్ని విస్మరించి మరీ మోడీ ప్రజలపై పన్నుల, ధరల భారం మోపుతున్నారు.

ఇక ధరల పెరుగుదల సామాన్యుల సొంతింటి కలను ఛిద్రం చేస్తున్నది. బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఇవి ప్రభుత్వ అజమాయిషీ లేని అంశాల జాబితాలోకి చేరిపోయాయి. ఆదాయాలు పెరగని ప్రజలు ధరల పెరుగుదలను భరించే స్థితిలో ఉంటారా? పాలకులు ఆలోచించాలి. ఇవే పన్నులు, జీఎస్టీ, అధికర ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే, అదే పాలకులు తమ జీత భత్యాల పెంపుపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉంటారు. సేవ పేరుతో రాజకీయాలు చేస్తూ, పదవుల పేరుతో రాజభోగాలు అనుభవిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను విస్మరిస్తున్నారు.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News