అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద BRS ఎమ్మెల్యేలు పల్లా, కెపి వివేక్, పాడి
భూభారతి చట్టం భూకబ్జాలను ప్రోత్సహించే చట్టంగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి కెపి వివేకానంద పాడి కౌశిక్ రెడ్డిలు అభివర్ణించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కెపి వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 లక్షల మంది రైతులకు కోటి 50 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించడమే కాకుండా, ఈ చట్టం ద్వారా రైతులకు పారదర్శకతను ఇచ్చినట్లు తెలిపారు. ఈ రోజు ఆమోదించిన భూ భారతి చట్టం కాంగ్రెస్ నేతల భూ కబ్జాలను ప్రోత్సహించే చట్టమని ఆరోపించారు. ధరణి సాఫ్ట్వేర్‌లో లోపాలు ఉన్నట్లు చెప్తున్నారు. ధరణీ లో ఎలాంటి చిన్న తప్పు కూడా కనిపించలేదని, 27 లక్షల ట్రాన్సాక్షన్లు సక్రమంగా జరిగాయని చెప్పారు. రేవంత్ వాదనలు, 6 గ్యారంటీలు, 420 హామీల విషయంలో దృష్టి మరల్చడానికే కేటీఆర్ పై కేసు పెట్టారని అన్నారు. సిఎం అనుభవ రాహిత్యంపై ప్రజలు నవ్వుకుంటున్నారని, ఫార్ములా ఈ రేసింగ్ వల్ల రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ పరువు రోజు రోజుకి దిగజారిపోతుందన్నారు.

