తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వడగండ్ల వాన కురుస్తుంది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వానలు పడుతున్నాయి. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించారు.

