మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఈ రోజు ఉదయం 11.45 గంటలకు ఢిల్లీని నిగంబోధ్ ఘాట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీలతోపాటు, ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి జనాలు హాజరుకానున్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆయన భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ప్రజలు ఆయనను చూసే అవకాశం దొరికింది. ఆ తర్వాత, 9:30 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది. ఈ విషయాన్ని హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి ప్రకటించింది. అంత్యక్రియలు పూర్తయ్యాక, ఆయన స్మారక చిహ్నం నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ ప్రక్రియను ఆయన్ని గౌరవిస్తూ, ఆయనకు ఉన్న సహకారం, గౌరవ భావంతో ప్రారంభిస్తామని తెలిపింది.

