ప్రతి ఏటా ఇనాయకులను నిలబెడత0.. తొమ్మిది, పది రోజులు ఘనంగా పూజలు సేస్త0. ఇగ గా ఇగ్రహాలను చెరువుల్ల, కుంటల్ల నిమజ్జనం సేస్త0. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సేసే గా ఇగ్రహాలను యేలకు యేలు, లచ్చలకు లచ్చల పోసి తెత్తం. పవిత్రంగా పూజలు సేస్త0. తీరా గాయాటిని తీసుకుపోయి దగ్గర్ల ఉన్న చెరువుల్ల, కుంటల్ల వేసి పూడిక పెంచుత0.. ఇగ గా సెరువులు, కుంటలు పూడికతో నిండిపోయి, నీళ్ళు నిలవక ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటిపోయి, పంటలు పండక, తాగేందుకు కూడా నీళ్లు దొరకక అలమటిస్తున్న0. అయినా ఏటేటా గిదే సేస్తున్న0.

ఇగ గిదీనికి గా బందరోల్లు మంచి ఉపాయం కనిపెట్టిండ్రు. బందర్ల లచ్చ ఇండ్లు, పొలాలు, పవిత్ర పదేశాలు, గుడుల ప్రాంగణాల నుండి సేకరించిన మట్టితోటి 63 అడుగుల మహా గణపతి యిగ్రహాన్ని నిలబెట్టి0డ్రు. మంచిగ పూజలు చేసిండ్రు. ఇనాయకుడిని కొలిసిండ్రు. ఇంకా నిమజ్జనం కూడా ఘనంగా నిర్వహించిండ్రు. కాకపోతే, గా నిమజ్జనాన్ని ఎరైటీగా పర్యావరణ హితంగా, చెరువుల్ల, కుంటల్ల కాకుండా, పక్కనే ఉన్న సముద్రంలో కూడా కాకుండ గాడనే చేసిండ్రు.
ఇనాయకుడిని నిలబెట్టిన సోటనే నిమజ్జనం కావించిండ్రు. తొలుత బిందెలతో నీల్లు తెచ్చి ఒక యిగ్రహానికి నీల్లు పొసి మంత్రి కొల్లు రవీంద్ర, ఉత్సవ కమిటీ సభ్యులు ఆరంభించిండ్రు. ఇగా తర్వాత పసుపు, కుంకుమ కలిపిన నీల్లను ఫైర్ జెట్స్ సాయంతోటి చిమ్మి ఉన్న సోటనే గణపతిని నిమజ్జనం చేసిండ్రు. ఇగ అంతా గిట్లనే సేస్తే, గా చెరువుల్ల, కుంటల్ల పూడిక పెరగది. ఇగ గా నీల్లకు కరువు రాదు. పర్యావరణం కూడా బాగై, సమయానికి కాలం అయితది. ఆనలు పడతయి. అంతా బాగుంటం. ఏమ0టరు?!

