ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ స్టేజి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని వెనుక నుంచి బొలెరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న 10 మంది గాయపడ్డారు. వీరిలో 5 మందికి తీవ్ర గాయాలు కాగా, మిగతా 5 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వారు మేడారం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారంతా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

