ఎవ్వలికైనా ఎవ్వలో ఒకలంటేనో, వాళ్ళ తీరంటేనో, అభిమానం ఉంటది. కనీ, గదాన్ని బటయ పెట్టడం, సాటుకోవడం అంత సులువేం కాదు. గీయినె అభిమానం సూసి, గా పెద్దాయినే మస్తు ఫిదా అయిండు. గదేందో తెలుసుకుందాం పదండ్రి.

కిరికెట్ టీమ్ ఇండియా ఓపెనర్ సంజు శాంసన్ తెలుసుక కదా? గాయినె తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని. గాయినె సినిమాలంటే పెయి కోసుకుంటడు. కండ్లు తీసుకుంటడు. గాయినె సినిమాలను యిడుదలైన మొట్టమొదటి రోజే సూత్తడట. గట్ల గీ మద్దెల గా ‘జైలర్’ సినిమా సూసేటందుకు యీలు కాలేదట. ఇగ గా ముచ్చటను తీర్సుకోనికి ఏం శేసిండో తెలుసా? ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ శేసిండు. గీ ముచ్చటను గా సంజునే వెల్లడించిండు. ‘నా భార్య, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చూసినం. బిగ్ స్క్రీన్‌పై రజనీ సర్‌ను శూసి శాలా సంబురపడ్డా. మా జట్టుల తమిళం వచ్చిన ప్రతి సపోర్టింగ్ స్టాఫ్ కూడా గా సినిమా చూసిండ్రు.’ అని తన సంతోషాన్ని సంజు పంచుకుండు. రజనీ ఫ్యాన్స్ ఎంత పెద్ద స్థాయిల ఉన్నా, తమ ఆరాధ్య నటుడిపై అభిమానం సూపడంల ఏ మాత్రం ఎనుకాడరని సంజు నిరూపించిండు.

