పెండ్లి శేసి సూడు… ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి పునాదులు తీసీ, పిల్లర్లేసి, గోడలు కట్టి, టాపు పోసి, దర్వాజలు, తలుపులు, కిటికీలు…ఇగ లోపల అన్నీ సర్దాల్నంటే మస్తు తిప్పలుంటయి. ఇల్లు కట్టేటప్పుడు గా గొడలకి నీల్లను కొట్టుడు శాలా ముఖ్యం. ఎంత మంచిగ నీల్లు కొడితే గంత మంచిగ గట్టిగ గోడలుంటయి. కనీ, గా గోడలకు నీల్లను కొట్టే గీ ఉపాయం సూడుండ్లి.

గోడలు పెడతాంటే.. గీ పోటువుల సూపినట్లు.. గా గోడలకు పాల్తిన్ కవర్లు సుట్టు కట్టి గట్టిగ మొలలు కొట్టాలె. ఇగ గా గడోలకు నీల్ల పడితే, గా నీల్లు బయటకి పోవు. లోపల నీల్లు తొందరగ ఆవిరిగావు, ఆరిపోవు. ఇగ ఒక తడికి మరో తడికి మద్దెల గా గోడల నీల్లు తొందరగ ఎండిపోవు కాబట్టి, గా గోడలు బాగా నీల్లు తాగి, గట్టిగైతయి. ఎట్లుంది గీ ఐడియా? అదిరింది కదా?

