మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి?

బెంగళూరులో ఒకాయినె రోజూ గా రోడ్డెంబడే పోతడు. ఓ కాడ రోడ్డుకు గుంటలు పడ్డయి. రోజులు పోతానయి కనీ, గదాన్ని ఎవ్వలు బాగు శేయలే. ఇగ గిదంత పని కాదని, గాయినే ఓ రోజు కోట్లు పెట్టికొన్ని ఖరీదైన పోర్షే కార్ల వచ్చిండు. ఇగ గా గుంట కాడనే కారాపిండు. పైనేసుకున్న కోటిప్పిండు. వెంట తెచ్చిన సిమిటి బత్తను ఇప్పిండు. గా సిమిటిని గా కారు బ్యానెట్ మీదనే పోసిండు. నీళ్లు కలిపిండు. గ మాల్ ను గా గుంటలేసి నింపిండు. బిర్రుగ తొక్కిండు. గాడ ఓ మంచినీల్ల బాటిల్ ను కూడ పెట్టిండు. గా కారు బ్యానెట్ మీదున్న పాల్తీన్ కవర్ను శింపేసిండు. ఎప్పటి లెక్కనే మల్లా కోటేసుకుండు. గాయింత గిదీన్ని ఈడియ తీసి, నెట్ ల పెట్టిండు. గ కారేసుకుని మునపటి లెక్కనే గా నుంచి పోయిండు. ఇగ గీ యీడియో నెట్టింట్ల తెగ వైరలైతాంది. భలేగా నిరసన తెలిపిండు గద?

