‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు. ఇగిప్పుడు గీ వాయినం గవాటికే కాదుల్లా.. బతుకమ్మలకు కూడా ఇత్తున్నరు. గదెక్కడంటే…

తెలంగాణల జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో గీ రీతిని మొదలు పెట్టిండ్రు. గా చైతన్యనగర్ పల్లవికి అగ్గిమల్ల ఊరు అరవింద్ తోటి ఐదు నెల్ల కిందట మనువైంది. ఇగ గా పెండ్లైనంక వచ్చిన తొలి బతుకమ్మకు గా అత్తింటోల్లు, పూలు, బత్తాయి, కాగితం, వెండి, నాణాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గాజులు, మెహందీ, ముత్యాలు, పసుపుకుంకుమ అసొంటి రకరకాల వస్తువులతోటి 25 రకాల బతుకమ్మలను తయారు శేసిండ్రు. ఇగ గా కొత్త జంటకు కొత్త బట్టలు పెట్టి బతుకమ్మ వాయినం ఇచ్చిండ్రు. గిదిప్పుడు కొత్త ట్రెండంటుల్లా!? ఇగ గిది ఎంత పచారమైతదో? ఎంత దూరం పోతదో!?

