Wednesday, September 16, 2026
31.2 C
Hyderabad

మీకో దండం మీ పార్టీకో దండం

Bjp| బీజేపీకి Ghoshamahal| గోషామహల్ mla| ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా |resignation

Leaders| నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి,

Hinduism| హిందుత్వానికి తాను అంకితమంటూ లేఖ | letter

గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన రాజాసింగ్, భార‌తీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నేతృత్వం తనను లక్ష్యంగా చేసుకొని మోసం చేసిందని, రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు పేరును ప్రకటించడంతో తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రెండు పేజీల కృతజ్ఞతా, తన అభిప్రాయాల లేఖను ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.

రాజాసింగ్ లేఖలో పేర్కొన్న విషయాలను చూస్తే, ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. లక్షలాది కార్యకర్తలు, ప్రజలు పార్టీలో విశ్వాసంతో నిలబడిన తరుణంలో, పార్టీ తొలి సారిగా తెలంగాణలో అధికారంలోకి రానుందన్న ఆశలు వ్యక్తమవుతున్న వేళ, పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం ఆశావాదాన్ని అణిచేసేలా ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం వ్యక్తిగతంగా తనకే కాకుండా, అనేకమంది బీజేపీ కార్యకర్తలకు, నమ్మకమైన ఓటర్లకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.

పార్టీలో అనుభవం కలిగిన ఎంతో మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ, వారికి అవకాశం ఇవ్వకుండా కర్టెన్ వెనుక ఉండే నేతల సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్రంగా బాధించింది అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం తీసుకున్న నిర్ణయంగా రాజాసింగ్ భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు . ఇది వేల మంది కార్యకర్తల త్యాగాలను విస్మరించడమేనని అన్నారు.

తాను బీజేపీకి అంకితమైన కార్యకర్తగా, ప్రజల ఆశీర్వాదంతో వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా, ఇలాంటి అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత కారణక వల్ల తీసుకున్న నిర్ణయం కాదని, కార్యకర్తల వేదనను ప్రతిబింబించడమే అని లేఖలో వివరించారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, సరైన నాయకత్వాన్ని ఎంపిక చేయకపోవడం వల్ల ఆ ఆశను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాజాసింగ్ తన లేఖ చివరి పేజీలో, పార్టీకి రాజీనామా చేసినా, హిందుత్వ సిద్ధాంతం, తన ధర్మ సేవ, గోషామహల్ ప్రజల పట్ల తన బాధ్యత మారదని పేర్కొన్నారు. హిందూ సమాజానికి తన సహకారం మరింత బలంగా కొనసాగుతుందని, ధైర్యంగా తన గొంతును వినిపిస్తానని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునః ఆలోచించాలని ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ తదితరులను కోరారు. తెలంగాణ బీజేపీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటి సమయంలో సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసి ఆ అవకాశాన్ని వదులుకోకూడదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, తన రాజీనామాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ప్రసాద్ కుమార్ కి తెలియజేయాలని కోరారు. ఈ ఉదంతం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూడుసార్లు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ద్వారా, పార్టీలో నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో భిన్నాభిప్రాయాలు, అంతర్గత సంఘర్షణలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వం సమీక్షిస్తే మంచిదని అనేక బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాజాసింగ్ ఇక నుంచి ఏ రాజకీయ నిర్ణయం తీసుకుంటారో, ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అయితే ఆయన ఇప్పటికీ హిందుత్వ సిద్ధాంతానికి అంకితమని స్పష్టంగా చెప్పడం ద్వారా, రాజకీయ ప్రయాణం కొనసాగించే సూచనలు లేఖలో కనిపిస్తున్నాయి.

ఇక పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసిన రాజాసింగ్ లేఖ బీజేపీలో చర్చలకు తావిస్తోంది. పార్టీ కేంద్ర నేతలు ఈ లేఖను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు, నాయకత్వ మార్పు పై మళ్లీ సమీక్ష జరగుతుందా? అన్నదానిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News