Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు

సత్వరమే కలెక్టర్ విచారణకు ఆదేశం

ముగ్గురు అంగన్ వాడీ టీచర్ల సస్పెండ్

యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్‌వాడి అవినీతిపై అడుగు స్పెషల్ స్టోరీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పౌష్ఠిక ఆహారం పథకం, రాష్ట్రంలోని చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ కార్యక్రమం కింద అంగన్‌వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు బాలామృతం, ఇతర పోషక ఆహారం అందించబడుతోంది. అయితే, యాదాద్రి భువనగిరి జిల్లా పలు ప్రాంతాల్లో పౌష్టిక ఆహారాన్ని అందించకుండా మాయం చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ… ఆలేరు నియోజకవర్గం, ఆలేరు మండలం, మంతపుర్ అంగన్ వాడి, రాజపేట మండలం, పుత్తగూడెం అంగన్వాడి, తుంగతుర్తి నియోజకవర్గం, మోత్కూరు మండల కేంద్రంలో అంగన్వాడి కేంద్రాల్లో ఈ పథకంలో అవినీతి చోటుచేసుకోవడం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేసింది.

అవినీతి ఆరోపణలు

ఈ మూడు ప్రాంతాల్లో అంగన్‌వాడి టీచర్లు , చిన్నారులకు అందించాల్సిన బాలామృతం మరియు గుడ్లను పక్కదారి పట్టించి ఇతరులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు. దీనితో పౌష్టికాహార పథకం అమలు కాకుండా, చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది.

గత ప్రభుత్వంలోని నిర్లక్ష్యం

ఈ సమస్యను స్థానికులు పలు దఫాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, గత ప్రభుత్వంలో నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల వినతులు, ఫిర్యాదులు కనీసం పరిశీలించబడకపోవడం వల్ల అవినీతి మరింతగా పెరిగింది.

కలెక్టర్ చొరవ

తాజాగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు ఈ విషయంపై ప్రతిసారి వినతులు రావడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో జరిగిన అవినీతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో, పౌష్టిక ఆహారం సరఫరా ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు స్పష్టమైంది.

టీచర్ల సస్పెన్షన్

విచారణ రిపోర్టు ఆధారంగా, అవినీతిలో ప్రధాన పాత్ర పోషించిన అంగన్‌వాడి టీచర్లను తక్షణమే సస్పెండ్ చేశారు. పథకంపై నేరుగా ప్రభావం చూపే ఇటువంటి చర్యలపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజల హర్షం

కలెక్టర్ హనుమంతరావు తీసుకున్న నిర్ణయాలకు జిల్లా ప్రజలు అభినందనలు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం, అభివృద్ధిని అడ్డుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారికి ప్రభుత్వమే గట్టి సమాధానం ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

పౌష్టిక ఆహార పంపిణీలో పారదర్శకత

ఈ సంఘటనల తర్వాత, పౌష్టిక ఆహార పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, ప్రతి అంగన్‌వాడి కేంద్రాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాచరణలో ఈ అంశాలను చేర్చడం ద్వారా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతాయి.

 

 

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News