Wednesday, September 23, 2026
22.5 C
Hyderabad

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా? ఒకవైపు అంతర్గత విభేదాలు, నాయకత్వ సంక్షోభాలు, మరోవైపు కేంద్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం స్థానిక రాజకీయ సంఘటనలు మాత్రమే కాదు. అవి భారత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న విస్తృత మార్పులకు ప్రతిబింబాలు.

రానున్న మూడేళ్లు భారత రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కాలం. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, సీట్ల పెంపు, సామాజిక న్యాయానికి సంబంధించిన కొత్త రాజకీయ చర్చలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగే పార్టీలే భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కుకోగలవు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా? గత మూడు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతమైతే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు అంతర్గత విభేదాలు, నాయకత్వ సంక్షోభాలు, మరోవైపు కేంద్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం స్థానిక రాజకీయ సంఘటనలు మాత్రమే కాదు. అవి భారత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న విస్తృత మార్పులకు ప్రతిబింబాలు.

1990ల తర్వాత దేశంలో కూటమి రాజకీయాలు బలపడ్డాయి. 1989 నుంచి 2014 వరకు దాదాపు ప్రతి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా నిలిచింది. ఒక దశలో లోక్‌సభలో ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం 35%నికి పైగా చేరుకుంది. అయితే 2014 తర్వాత పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. జాతీయ స్థాయిలో ఒకే పార్టీ ఆధిపత్యం పెరగడంతో పాటు ప్రాంతీయ పార్టీల రాజకీయ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. 2024 సాధారణ ఎన్నికల తర్వాత కూడా ఈ ధోరణి కొనసాగుతుందా? అవుననే చెప్పాలి.

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశాల్లో మహిళా రాజకీయ ప్రాతినిధ్యం, డీలిమిటేషన్, పార్లమెంటరీ సంస్కరణలు ప్రధానమైనవి. మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ చట్టం ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందింది. లోక్‌సభలో 543 స్థానాలు ఉండగా, 33% రిజర్వేషన్ అమలైతే 181 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో మహిళా సభ్యుల శాతం సుమారు 14 శాతమే. అంటే మహిళా ప్రాతినిధ్యం దాదాపు రెండున్నర రెట్లు పెరగాల్సి ఉంటుంది.

ఇక్కడే డీలిమిటేషన్ అంశం రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారుతోంది. 1976లో విధించిన నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న పరిమితులు 2026 తర్వాత ముగియనున్నాయి. దీంతో కొత్త జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్ల పునర్విభజనపై చర్చలు వేగం పుంజుకున్నాయి. దేశ జనాభా 1971లో 54.8 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 140 కోట్లకు పైగా ఉంది. అయితే లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం 543గానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరంపై చర్చ జరుగుతోంది.

పార్లమెంట్‌కు కొత్త భవనం నిర్మాణం కూడా ఈ చర్చకు బలం చేకూర్చింది. కొత్త లోక్‌సభ హాల్‌లో 888 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఉమ్మడి సమావేశాల సమయంలో 1,272 మందికి పైగా సభ్యులు కూర్చునేలా సదుపాయాలు కల్పించారు. దీన్ని బట్టి భవిష్యత్తులో లోక్‌సభ స్థానాల పెంపుపై కేంద్రం ఆలోచిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాజకీయ వర్గాల్లో సీట్ల సంఖ్యను 50 శాతం వరకు పెంచే అవకాశాలపై కూడా చర్చ సాగుతోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 800కు పైగా పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే డీలిమిటేషన్ విషయంలో అత్యంత కీలకమైన అంశం ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతౌల్యం. జనాభా నియంత్రణలో విజయవంతమైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు అదనపు స్థానాలపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములాను రూపొందించడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తున్న అంతర్గత సంక్షోభాలు కూడా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన విభజన, ఎన్సీపీ చీలిక, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో నాయకత్వంపై అసంతృప్తి, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎదుర్కొంటున్న సంస్థాగత సమస్యలు ప్రాంతీయ రాజకీయాల బలహీనతను బయటపెడుతున్నాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేసిన పార్టీలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికే పోరాడాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.

అయితే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పూర్తిగా ముగిసిందని భావించడం పొరపాటే అవుతుంది. భారతదేశం భాషా, సాంస్కృతిక, ప్రాంతీయ వైవిధ్యాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. స్థానిక సమస్యలు, ప్రాంతీయ ఆకాంక్షలు, భాషా గుర్తింపులు ఇంకా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో కూడా స్థానం ఉంటుంది. కానీ మారుతున్న రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం మాత్రం తప్పదు.

రానున్న మూడేళ్లు భారత రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కాలంగా మారే అవకాశముంది. మహిళా రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్, సీట్ల పెంపు, సామాజిక న్యాయానికి సంబంధించిన కొత్త రాజకీయ చర్చలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగే పార్టీలే భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కుకోగలవు. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలను కేవలం పార్టీల అంతర్గత సమస్యలుగా కాకుండా, భారత ప్రజాస్వామ్యం కొత్త దశలోకి ప్రవేశిస్తున్న సంకేతాలుగా చూడాల్సిన అవసరం ఉంది.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News