Wednesday, September 23, 2026
26 C
Hyderabad

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఎల్‌నినో హెచ్చరికలు కేవలం వాతావరణ శాఖ నివేదికలకే పరిమితం కాకుండా, ప్రభుత్వాల కార్యాచరణకు పునాది కావాలి. లేకపోతే కరువు, నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం, పర్యావరణ విపత్తుల రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రకృతిని రక్షించడం, జలవనరులను సంరక్షించడం, భూమిని పునరుద్ధరించడం ద్వారానే భవిష్యత్ తరాలకు భద్రమైన జీవనాన్ని అందించగలం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన వేళ ఎల్‌నినో హెచ్చరికలు దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలపై ఆధారపడిన భారత వ్యవసాయ రంగానికి ఇది అసాధారణ వాతావరణ హెచ్చరిక. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి, ఆహార భద్రతలను ప్రభావితం చేసే జాతీయ సవాల్. అయితే, ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాల స్థాయిలో ఆశించిన స్థాయి అప్రమత్తత మాత్రం కనిపించడం లేదు.

ఎల్‌నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కనీసం 0.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ దృగ్విషయం. ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావం ఏర్పడిన సంవత్సరాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. భారతదేశంలో ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తాయి. దేశంలోని వ్యవసాయ భూముల్లో 52 శాతం ఇప్పటికీ వర్షాధార సాగుపైనే ఆధారపడి ఉన్నాయి.

చరిత్రను పరిశీలిస్తే ఎల్‌నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది. 2002లో దేశంలో సాధారణ వర్షపాతం కంటే 19 శాతం తక్కువ వర్షాలు నమోదయ్యాయి. 2009లో 22 శాతం లోటు నమోదైంది. ఈ రెండు సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తి భారీగా దెబ్బతింది. లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం పడింది. అందుకే ఎల్‌నినో హెచ్చరికలను కేవలం వాతావరణ సమాచారంగా కాకుండా ఆర్థిక హెచ్చరికగా కూడా చూడాల్సి ఉంటుంది.

ఎల్‌నినో ప్రభావంతో సాధారణంగా వర్షపాతం తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భూమి మరింత పొడిగా మారుతుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇది కేవలం వర్షాభావానికే పరిమితం కాదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బరస్ట్ ఘటనలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు నీటి కొరత, మరోవైపు విపత్తులు అనే ద్వంద్వ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

దేశంలో తలసరి నీటి లభ్యత 1951లో 5,177 క్యూబిక్ మీటర్లుగా ఉండగా ప్రస్తుతం 1,500 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ తలసరి నీటి లభ్యత ఉన్న దేశాలను నీటి ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశాలుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో ఎల్‌నినో ప్రభావం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, వాగులు, నదీ పరివాహక ప్రాంతాలు ఇప్పటికే ఆక్రమణలకు గురవుతున్నాయి. భూగర్భ జలాల వినియోగం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గితే తాగునీటి సంక్షోభం తీవ్రమవడం ఖాయం.

వ్యవసాయ రంగంలో కూడా ముందస్తు ప్రణాళికలు అత్యవసరం. వరి, చెరకు వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా జొన్న, సజ్జ, రాగి, పెసర, కంది వంటి ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి. విత్తనాల సరఫరా, పంటల బీమా, మార్కెట్ భరోసా వంటి అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వ్యవసాయ శాఖలు గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి. ఎల్‌నినో ప్రభావం తెలిసిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సిద్ధపడటం వల్ల నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు.

అయితే, ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచ భూభాగంలో 40 శాతం ప్రాంతం ఇప్పటికే భూమి క్షీణత ప్రభావానికి లోనైంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు దీని ప్రభావాన్ని అనుభవిస్తున్నారు.

ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆచరణాత్మక మార్పులు కనిపించడం లేదు. చెరువులను ఆక్రమిస్తున్నాం. అడవులను నరికేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రకృతిని కలుషితం చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణపై సమావేశాలు, ప్రసంగాలు పెరుగుతున్నా కార్యాచరణ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. నీటి సంరక్షణ, పంటల మార్పిడి, భూగర్భ జలాల నిర్వహణ, గ్రామీణ ఉపాధి, విపత్తు నిర్వహణ అంశాలను సమగ్రంగా అమలు చేయాలి. పర్యావరణ సంస్థలు, శాస్త్రవేత్తలు, యువజన సంఘాలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. దీనిని ప్రజా ఉద్యమంగా మలచాలి.

ఎల్‌నినో హెచ్చరికలు కేవలం వాతావరణ శాఖ నివేదికలకే పరిమితం కాకూడదు. అవి ప్రభుత్వాల కార్యాచరణకు పునాది కావాలి. లేకపోతే కరువు, నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం, పర్యావరణ విపత్తుల రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రకృతిని రక్షించడం, జలవనరులను సంరక్షించడం, భూమిని పునరుద్ధరించడం ద్వారానే భవిష్యత్ తరాలకు భద్రమైన జీవనాన్ని అందించగలం. ఎల్‌నినోను ఎదుర్కొనే అసలైన కార్యాచరణ అదే.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News