బీజేపీ సంస్థాగత ఎన్నికలపై ఆదివారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, జాతీయ కార్యాలయ బేరర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా, బీజేపీ హైకమాండ్, రాష్ట్రాలకు చెందిన నాయకులతో సంస్థాగత ఎన్నికలపై దిశానిర్దేశం చేయడం జరిగింది.
సమావేశంలో, ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు పూర్తి అయ్యిందని సమీక్ష నిర్వహించి, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి తర్వాత, కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు మార్గం సుగమమవుతుందని అధిష్టానం సూచించింది.
కేవలం సంస్థాగత ఎన్నికలే కాకుండా, పార్టీని బలోపేతం చేయడంపై, వచ్చే కార్యాచరణలపై కూడా చర్చలు జరిగాయి. ఈ సమావేశం ద్వారా, బీజేపీ భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, సంస్థాగత నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

