అంతా గ్యాసే! ఇంటింటా, వంటింటా.. ఓటల్లు, పంక్చన్ హాల్లు.. ఏడ సూసినా గ్యాసే. ఇగిప్పుడు గా యుద్ధం సేయబట్టి, గా గ్యాస్ కు కొరతొచ్చె. మరి గ్యాస్ లేకపోతే ఎల్లదాయె. ఇగ కట్టెల పొయ్యి కట్టాలను ఏనాడో పక్కన పెడితిమి. ఇగిప్పుడు ఏం శేయాల్నని అంతా ఆలోశిస్తాంటే… గాయినొకాయెనె గా గ్యాస్ సిలిండర్ నే కట్టెల పొయ్యి శేసిండు.

గ్యాస్ సిలిండర్ ను తీసుకున్నడు గదాని తలా తోక తీసేసిండు. గుండ్రంగ ఉండే దానికి ఒక పక్కన ఒడుపుగ కత్తిరించి, తలుపు లెక్క శేసిండు. ఇగ ఇంకోకెల్లి కట్టెలు పెట్టడానికి సందు శేసిండు. గదాంట్లనే పొయ్యిని శేసిండు. ఇగ గదాన్ని పొయ్యి లెక్క ఆడుతున్నడు. మంచిగుంది కదా గీ ఉపాయం. మనమంతా ఎనకటి రోజులకే యెలతానమా ఏంది?

