పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, శాతపురం గ్రామానికి చెందిన రైతు గాదరి రామయ్య తాము సాగు చేసిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొంటున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలకు వినూత్నంగా ధన్యవాదాలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జె. తొర్రూరు సొసైటీ ఆధ్వర్యంలో శాతపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం కొన్న ధాన్యంపై రంగులతో “సీఎం రేవంత్ రెడ్డి – ఎమ్మెల్యే యశస్విని రెడ్డి” అని త్రివర్ణ పతాక రంగులతో రాసి అందర్ని ఆశ్చర్యాన్ని కలిగించారు. ఈ చిత్రంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో మద్దతు ధర, వేగవంతమైన కొనుగోలు ప్రక్రియలతో రైతులలో ఆదరణ పెరుగుతుందని రామయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్య పాత్ర పోషించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

